*తళుక్కుమని మెరుస్తున్న నాగార్జున సాగర్*
*== అకట్టుకుంటున్న 26 క్రస్ట్ గేట్లు*
*== అలరిస్తున్న విద్యుత్ కాంతులు*
(రిపోర్టర్- శ్యామ్)
నాగార్జునసాగర్ ఆగస్టు 14( విజయం న్యూస్)
సాగర్ డ్యామ్ క్రస్ట్ గేట్లకు జాతీయ జెండా రంగుల విద్యుత్తు కాంతులను ఏర్పాటు చేయడం తో 26 క్రస్ట్ గేట్లు నుండి జాలువారుతున్న కృష్ణమ్మ పరవళ్ళు విద్యుత్ కాంతులలో జాతీయ జెండా రంగు అందంగా కనిపిస్తుంది.
ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున సాగర్ కు పర్యాటకుల రద్దీ పెరిగింది. 26 క్రస్ట్ గేట్ల నుండి కృష్ణమ్మ పరవళ్ళు వీక్షించేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. వరుస సెలవు దినాల నేపథ్యంలో కుటుంబ సమేతంగా సాగర్ కు తరలి వస్తున్నారు. కొత్త వంతెన, శివాలయం, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ప్రధాన డ్యాం బుద్ధ వనం లాంచీ స్టేషన్ ల వద్ద పర్యాటకుల కోలాహలం నెలకొంది.
ఈ ప్రాంతంలోని హోటల్ లు, వసతి గృహాలు, తినుబండారాల షాపుల వద్ద రద్దీ నెలకొంది. ఇరు రాష్ట్రాల పర్యాటకులు భారీగా రావడంతో జోరుగా వ్యాపారాలు సాగుతున్నాయి.
allso read- మునుగోడు కు సీఎం కేసీఆర్… ఎప్పుడంటే..?
— కొనసాగుతున్న వరద ప్రవాహం
ఈ ఏడాది కృష్ణా నది పరివాహక ప్రాంతం నుండి వస్తున్న వరద ప్రవాహం తో సాగర్ డ్యాం 26 క్రస్ట్ గేట్లు తెరిచి ఉంచడంతో ఆ సుందర దృశ్యాన్ని తిలకించడానికి పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటికే కృష్ణా నది ఎగువ ప్రాంతంలో జలాశయాలు పూర్తిస్థాయి లో నిండి ఉండటంతో వరద ప్రవాహాన్ని గత నాలుగు రోజుల నుండి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం నాటికి సాగర్ జలాశయం 590 అడుగులకు గాను 584.90 అడుగులు టీ ఏం సి ల లో 297.1465 కు సమానం. కుడి కాలువ ద్వారా 8604 క్యూసెక్కులు ఎడమ కాలువ ద్వారా 8629 క్యూసెక్కులు ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 33130 క్యూసెక్కులు 26 క్రెస్ట్ గేట్లల లో 16 క్రస్ట్ గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి, మిగిలిన 10 గేట్లు పది అడుగుల ఎత్తు ఎత్తి 260316 క్యూసెక్కులు ఎస్ఎల్బీసీ ద్వారా 2400 క్యూసెక్కులు వరద కాలువ ద్వారా 300 క్యూసెక్కులు మొత్తం నీటి విడుదల 313379 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను 884.40 అడుగులు టీ ఏం సి లో 211.9672 కు సమానం. శ్రీశైల జలాశయం పది గేట్లను 12 అడుగుల ఎత్తు ఎత్తి 317460 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి ఎగువ నుండి 378483 క్యూసెక్కుల నీరు వస్తుంది. ఈ వరద ప్రవాహం ఇలా కొన్ని రోజు కొనసాగే అవకాశం ఉండదని నిపుణులు భావిస్తున్నారు.