నాగార్జునసాగర్ డ్యామ్ 26 క్రస్ట్ గేట్లు ఎత్తివేత
* దిగువకు 3,80,016 క్యూసెక్కుల నీరు
* సాగర్ కు భారీగా వస్తున్న వరద నీరు
(రిపోర్టర్: శ్యామ్)
(నాగార్జునసాగర్- విజయం న్యూస్)
నాగార్జునసాగర్ డ్యాంకు వరద ముప్పు పొంచి ఉందా..? ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తోందా..? ఆ నీటిని దిగువకు విడుదల చేస్తే సరిపోతుందా..? అంటే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టంకు నీరు చేరుకోగా ఎగువ నుంచి వస్తున్న వరదను దిగువకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి : సింగరేణిని బహుళ జాతి సంస్థలకు అమ్మే కుట్ర : భటివిక్రమార్క
ఎగువ నుండి భారీగా వరద ప్రవాహం వస్తుండడం తో గురువారం తెల్లవారుజామున 5 గంటలకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు సీఈ శ్రీకాంత్ రావు ఎస్ఈ ధర్మానాయక్ క్రస్ట్ గేట్ల స్విచ్ ఆన్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు. కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుంది. సాగర్ జలాశయం పూర్తి స్థాయి కి వరద నీరు రావడం తో జలాశయం నిండుకుండలా తొణికిసులాడుతోంది. జలాశయం నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం588 అడుగులు నాగార్జునసాగర్ జలాశయ కు ఎగువనున్న నుండి నుండి4,22,761 క్యూసెక్కుల నీరు వస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు 15 అడుగుల ఎత్తు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జునసాగర్ జలాశయం కు ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని బట్టి సాగర్ డ్యాం 26 క్రస్ట్ గేట్లను10 అడుగుల ఎత్తు ఎత్తి3,80,016 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుండి వస్తున్న వరద ప్రవాహాన్ని సమానంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేస్తున్నారు. సాగర్ డ్యామ్ కుడి కాలువ ద్వారా5,292 క్యూసెక్కులు ఎడమ కాలువ ద్వారా4,547 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుండి భారీగా వస్తున్న వరద నీటిని దిగువకు విడుదల చేయడం దిగువ కృష్ణా నది పరివాహక ప్రాంతం అప్రమత్తంగా ఉండాలని ప్రజలు అధికారులు సూచిస్తున్నారు. సాగర్ డ్యాం 26 క్రస్ట్ గేట్లు తెరిచారు అని వార్త తెలియగానే పర్యాటకులు నాగార్జునసాగర్ చూడటానికి వస్తున్నారు నాగార్జునసాగర్ కొత్త బ్రిడ్జి, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం వద్ద పర్యాటకుల కోలాహలం పెరిగింది.