నాగులమ్మా….. నీ గుట్టను కాపాడేవారే లేరా..?
—-కోట్లాది రూపాయల విలువ గల గుట్ట మాయం
—-చూస్తూ చూడనట్లు గా వ్యవహరిస్తున్న అధికారులు
—-ఇందులో ఎవరి వాటా ఎంతో
(సుంక శ్రీధర్ పెద్దపల్లి ప్రతినిధి – విజయం న్యూస్):-
హరితహారం, పల్లె ప్రకృతి వనం, పట్టణం ప్రకృతి వనం అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పచ్చదనం కోసం కోట్లు ఖర్చు పెడుతూ ఉంటే, ఇదేమి నాకు సంబంధం లేదంటూ ఒక అధికార పార్టీ నేత గుట్టపై ఉన్న చెట్లు నరుకుతూ, దాదాపు కోటి రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నాడు. ఇదంతా జరుగుతున్నా రెవెన్యూ అధికారులు తమకేం తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారు. పట్టపగలే యదేచ్ఛగా మట్టిని తరలిస్తూ ఉంటే మైనింగ్ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. గతంలో హరితహారం పేరిట ప్రభుత్వం ఆ గుట్టకు వేలాది రూపాయలు ఖర్చుపెట్టి చెట్లను నాటితే, ఆ అధికార పార్టీ నేత మాత్రం జెసిబి సాయంతో ఆ చెట్లను తొలగిస్తే అటవీశాఖ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు.
also read :-రౌడీల రాజ్యం గా మారిన కేసీఆర్ ప్రభుత్వం అని షర్మిల మండిపడింది.
పూర్తి వివరాల్లోకి వెళితే పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండలం బురహన్ మియాపెట్ గ్రామంలోని సర్వే నంబర్ 117 ప్రభుత్వ భూమిలో ఉన్న సుమారు నాలుగు ఎకరాల నాగుల గుట్ట ను ఓ అధికార పార్టీ నేత గత రెండు సంవత్సరాలుగా కొద్దికొద్దిగా ఆక్రమిస్తూ, మట్టిని అమ్ముకుంటూ వ్యవసాయ భూమి గా మార్చుతున్నాడు. ఇతనికి రెవెన్యూ అధికారుల, మండలంలోని అధికార పార్టీ నాయకుల, స్థానిక ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయంటూ, జిల్లా కలెక్టర్ కార్యాలయం లో అధికారి తనకు వరుసకు కాక అవుతారంటూ ప్రచారం చేసుకుంటున్నాడు. దళిత నేత కావడంతో ఎవరైనా ప్రశ్నిస్తే అట్రాసిటీ కేసు పెడతాను అంటూ విలేకరులను, అధికారులను బెదిరింపులకు గురిచేస్తున్నాడు. గతంలో లో ఇదే గుట్ట వ్యవహారంపై “విజయం” దినపత్రిక ప్రతినిధి స్థానిక ఎమ్మార్వో పద్మావతికి కు ఫిర్యాదు చేయగా అప్పటి ఆర్.ఐ రజని ని గుట్ట వద్దకు పంపించి తూతూమంత్రంగా తనిఖీలు చేశారు.
also read :-చండ్రుగొండలో అర్ధరాత్రి మట్టి అక్రమ రవాణా కు చెక్
కానీ ఆ అధికార పార్టీ నేతపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రజల కోసం పని చేయాల్సిన అధికారులు నాయకులు ఇచ్చే డబ్బులకు ఆశపడి చూసి చూడనట్టుగా వివరిస్తూ ఆ నాయకుడికి కొమ్ముకాస్తున్నారు. ఈ గుట్ట వ్యవహారంపై బురహాన్ పేట పేట అధికార పార్టీ నేత తో పాటు మండలంలోని మరో అధికార పార్టీ బడా నేతకు వాటాలు ఉన్నట్లుగా పలువురు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి అధికార పార్టీ నేత పై చర్యలు తీసుకొని కోట్లాది రూపాయల ప్రభుత్వ భూమిని కాపాడాలని పలువురు కోరుతున్నారు