Telugu News

జడ్పీ ఛైర్‌పర్సన్‌ పై అనర్హత వేటు

జడ్పీటీసీ ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు

0

జడ్పీ ఛైర్‌పర్సన్‌ పై అనర్హత వేటు*

== జడ్పీటీసీ ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు

(నాగర్‌కర్నూలు-విజయం న్యూస్)

నాగర్‌కర్నూలు జడ్పీ ఛైర్‌పర్సన్‌ పెద్దపల్లి పద్మావతి విషయంలో హైకోర్టు సంచలన ప్రకటన చేసింది. ముగ్గురు పిల్లలు ఉన్నారని కచ్చితమైన ఆధారాలు చూపించడంతో హైకోర్టు జడ్పీ చైర్మన్ కు షాక్ ఇచ్చింది.  జడ్పీటీసీ ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు ప్రకటించింది.

Allso read- ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దారుణహత్య

2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెల్కపల్లి మండలం నుంచి జడ్పీటీసీగా గెలిచిన పద్మావతికి ముగ్గురు సంతానం ఉన్నట్లు ప్రూవ్ కావడంతో ఆమె ఎన్నిక చెల్లదని హైకోర్టు తేల్చి చెప్పింది.కాంగ్రెస్ అభ్యర్థి సుమిత్ర గెలిచినట్లు ప్రకటించాలని ఆదేశాలు జారీ చేసింది.ఆ ఎన్నికల్లో పద్మావతి టీఆర్ఎస్‌ నుంచి పోటీ చేశారు.ఆమెకు ముగ్గురు సంతానం ఉన్నారని కాంగ్రెస్ అభ్యర్థి సుమిత్ర ఆధారాలతో సహా స్క్రూటినీకి ముందే ఎన్నికల ఆఫీసర్‌కు కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదు. ఎన్నికల్లో పద్మావతి గెలవడంతో ఆమెపై సుమిత్ర జిల్లా ఎలక్షన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ వేశారు.దీనిపై విచారించిన ట్రిబ్యునల్ పద్మావతి ఎన్నిక చెల్లదని ఈ ఏడాది జులై 15న తీర్పు ఇచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినట్లుగా ప్రకటించాలని జిల్లా ఎలక్షన్ అథారిటీ,స్టేట్ ఎలక్షన్ కమిషన్‌కు ఆదేశాలు జారీ చేసింది.ఈ తీర్పుపై పద్మావతి హైకోర్టులో అప్పీల్ చేశారు. విచారణ అనంతరం హైకోర్టు ఆమె ఎన్నిక చెల్లదంటూ తీర్పు చెప్పింది.

Allso read:- తుమ్మల, రేగా కలిశారు..అంతర్యమేంటో..?