Telugu News

బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన నర్సయ్యగౌడ్

మూడు పేజీల లేఖను అధినేతకు పంపించిన మాజీ ఎంపీ

0

బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన నర్సయ్యగౌడ్

== మూడు పేజీల లేఖను అధినేతకు పంపించిన మాజీ ఎంపీ

== త్వరలో బీజేపీలో చేరే అవకాశం

(నల్గొండ-విజయంన్యూస్)

సీఎం కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ షాక్ ఇచ్చాడు.టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా నామకరణం చేసిన అతి కొద్ది రోజులకే మాజీ ఎంపీ, తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు బూరా నర్సయ్యగౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు మూడు పేజీల లేఖను సీఎం కేసీఆర్ కు పంపించారు. తనకు ఎంపీగా అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. పార్టీలో ఎంతో కష్టపడి పనిచేశానని, పార్టీ బలోపేతం కోసం తనవంతు శక్తివంచనలేకుండా ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యామని అన్నారు. ఎంపీగా గెలవడమే కాకుండా, మరోసారి ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.

ఇది కూడా చదవంఢి: బీజేపీ స్వార్ధంతోనే మునుగోడు ఉపఎన్నిక :మంత్రి పువ్వాడ

ఎంపీగా ఓటమి చెందిన తరువాత పార్టీ నాయకులే చాలా అవమానించారని, అయినప్పటికి సీఎం కేసీఆర్ కోసం పనిచేశానని అన్నారు. ఇంకా అవమానాలను భరించే ఓపిక నాకు లేదని, అందుకే పార్టీకి అవసరం లేదని భావించి రాజీనామా చేస్తున్నానని అన్నారు. అయితే బూరా నర్సయ్యగౌడ్ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి కోసం ప్రయత్నం చేసినప్పటికి ఫలితం లేకపోయింది. ఆయన త్వరలో బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమిత్ షా, నడ్డాను కలిసినట్లు చర్చ జరుగుతుంది. అతి త్వరలో అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి అదిలోనే హంసపాదైనట్లైంది. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ తో ఇతర పార్టీ నాయకులను చేర్చుకునే ప్రయత్నం చేస్తుంటే, అదిలోనే నల్గొండ జిల్లాలోనే కీలక నాయకుడు, మాజీ ఎంపీ పార్టీ మారడంతో బీఆర్ఎస్  పార్టీకి నిజంగా షాక్ తగిలినట్లే. ఇదిలా ఉండగా మునుగోడు ఎన్నికల సమయంలో బూరా నర్సయ్యగౌడ్ రాజీనామా చేయడం పట్ల కచ్చితంగా బీజేపీ అదిష్టానం వ్యూహత్మకంగా నిర్ణయం తీసుకుందనే చెబుతున్నారు. ఎన్నికల సమయంలో పార్టీ మారితే ఓటర్లు టీఆర్ఎస్ కు ఓటేసేదానికంటే బీజేపీకే వేయడం మంచిదనే విషయంగా ఆలోచిస్తారని బీజేపీ బూరా నర్సయ్యగౌడ్ తో రాజీనామా చేయించినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: ఏజెన్సీలో బినామీల దందా..?