Telugu News

చీమలపాడు బాధితులకు నామా అర్థిక చేయూత

ఎంపీ నామ సొంత నిధులతో చీమలపాడు బాధితులకు రూ.50 వేలు చొప్పున ముగ్గురికి అందజేసిన ఎమ్మెల్యే రాములు నాయక్

0

చీమలపాడు బాధితులకు నామా అర్థిక చేయూత

== ఎంపీ నామ సొంత నిధులతో చీమలపాడు బాధితులకు రూ.50 వేలు చొప్పున ముగ్గురికి అందజేసిన ఎమ్మెల్యే రాములు నాయక్

== గొప్ప మానవతావాది ఎంపీ నామ: ఎమ్మెల్యే రాములు నాయక్
 ఖమ్మం, మే 30(విజయంన్యూస్):

చీమలపాడు ఘటన బాధితులకు సీఎం కేసీఆర్, ఎంపీ నామ నాగేశ్వరరావు పూర్తి స్థాయిలో అండగా ఉండి వారి కుటుంబాలను  అన్ని విధాలా ఆదుకున్నారని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ , రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. చీమలపాడు సిలెండర్ పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడి, ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ  కోలుకుంటున్న క్షతగాత్రులు ఆంగోత్ రవికుమార్ ( వెంకట్యా తండా), తేజావత్ భాస్కర్ ( తవిశబోడు) , నవీన్ కుమార్(కానిస్టేబుల్, కారేపల్లి) లకు ఒక్కొక్కరికి రూ.50 వేలు చొప్పున బీఆర్ఎస్ లోక్ సభా పక్ష  నాయకులు,  ఖమ్మం పార్లమెంట్ సభ్యులు
నామ నాగేశ్వరావు ఆదేశాల మేరకు ఎంపీ సొంత నిధులను మంగళవారం ఎమ్మెల్యే రాములు నాయక్  నల్లమలతో కలసి  క్షతగాత్రులకు  అందజేయడం జరిగింది.

ఇది కూడా చదవండి: పత్తి వ్యాపారులను కాపాడండి: నామా

ఈ సందర్భంగా రాములు నాయక్, నల్లమల  మాట్లాడుతూ  ఘటన పట్ల ఎంపీ నామ ఎంతో దిగ్ర్బాంతి చెంది, బాధ పడ్డారని అన్నారు. ఘటన జరిగిన తర్వాత నామ నాగేశ్వరరావు దగ్గరుండి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించారని అన్నారు.కొంతమంది క్షతగాత్రులను హైదరాబాద్ నిమ్స్ కు తరలించి, నామ దగ్గరుండి వైద్య సేవలు అందించిన విషయం గుర్తు చేశారు. అలాగే చనిపోయిన కుటుంబాలకు సొంతంగా రూ.2 లక్షలు చొప్పున అందించిన మానవతావాది నామ అని కొనియాడారు. అంతేకాకుండా తీవ్రంగా గాయపడిన వారికి కూడా సొంతంగా రూ.50 వేలు చొప్పున మంగళవారం ముగ్గురికి రూ.1.50 వేలు అందించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఖమ్మం ప్రభుత్వ అస్పత్రిలో ఇద్దరికి, ఖమ్మం ముస్తఫానగర్లో నవీన్ కుమార్ కు  50 వేలు చొప్పున ఇచ్చామని చెప్పారు. చీమలపాడు ఘటన బాధితులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విధాలా అండగా ఉండి ఆదుకోవడం జరిగిందని,  గాయపడిన కార్యకర్తలకు ప్రభుత్వం సంపూర్ణ భరోసా కల్పించిందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో  రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు , ఎంపీ క్యాంప్ కార్యాలయం ఇంచార్జి కనకమేడల సత్యనారాయణ, జిల్లా టెలికాం సలహా మండలి సభ్యులు చిత్తారు సింహాద్రి యాదవ్ , చీమలపాడు సర్పంచ్ మాలోత్ కిషోర్ , తొడితలగూడెం సర్పంచ్ బాణోత్ కుమార్ , పార్టీ సింగరేణి మండల నాయకులు బత్తుల శ్రీనివాసరావు ,కారేపల్లి సొసైటీ డైరెక్టర్ డేగల ఉపేందర్,  మండల యూత్ నాయకులు ఎర్రబెల్లి రఘు, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే: నామా