Telugu News

డీసీఎంఎస్ మాజీ చైర్మన్ మృతి.. నామా  సంతాపం

శేషగిరిరావు మృతి పార్టీకి తీరని లోటు : నామ

0

డీసీఎంఎస్ మాజీ చైర్మన్ మృతి

== నామ, పువ్వాడ, వద్దిరాజు, కందాళ, సండ్ర  సంతాపం

➡️ శేషగిరిరావు మృతి పార్టీకి తీరని లోటు : నామ

ఖమ్మం, మే 15(విజయం న్యూస్):

మాజీ డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు బుధవారం మృతి చెందారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఖమ్మం జిల్లా ,తల్లాడ మండల, మిట్టపల్లి గ్రామం నివాసి గల ఖమ్మం జిల్లా మాజీ డీసీఎంఎస్ చైర్మన్* పలు రకాల జిల్లా,మండల ప్రజలకు సేవలందించి *తన సుదీర్ఘ కాలానంత* ప్రజా సేవకే అంకితం చేసిన నేత *రాయల వెంకట శేషగిరిరావు* సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ నందు చికిత్స పొందుచు కన్ను మూశారు.

== నామా నాగేశ్వరరావు సంతాపం
ఖమ్మం జిల్లా బి.ఆర్. ఎస్. పార్టీ సీనియర్ నాయకులు, తల్లాడ మండల తొలి ఎంపీపి, ఖమ్మం జిల్లా మాజీ డీసిఎంఎస్ చైర్మన్, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం జీవితాంతం కృషి చేసిన రాయల వెంకట శేషగిరిరావు అకాల మరణం పట్ల ఖమ్మం ఎం.పి, బి. ఆర్. ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు నామ నాగేశ్వర రావు బుధవారం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. గత 20 సంవత్సరాలుగా తనతో ఉన్న రాజకీయ అనుబందాన్ని గుర్తు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా తనతో కలిసి చేసిన ప్రయాణాన్ని నామ గుర్తు చేసుకుంటూ వారు ఎప్పుడూ రైతాంగ సమస్యల గురించే ఆలోచించే వారన్నారు. ఒక మంచి నాయకున్ని కోల్పోవడం పార్టీకి తీరని లోటన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

== ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సంతాపం

ఖమ్మం డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ రాయల శేషగిరిరావు మృతి పట్ల రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.ఖమ్మం జిల్లాకు,బీఆర్ఎస్ కు ఆయన విశేష సేవలందించారని తన సంతాప సందేశంలో ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు.ఆయన మృతి వల్ల బీఆర్ఎస్ కు, ఖమ్మం జిల్లాకు తీరని లోటు అన్నారు.శేషగిరిరావు కుటుంబ సభ్యులకు ఎంపీ వద్దిరాజు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు,ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.

*శేషగిరి రావు మృతి పట్ల మాజీ మంత్రి పువ్వాడ సంతాపం..*

ఖమ్మం మాజీ DCMS ఛైర్మన్ రాయల శేషగిరి రావు  కొద్దిసేపటి క్రితం మృతి చెందారు. వారి మృతి పట్ల మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం ఒక ప్రకటన ద్వారా సంతాపం వ్యక్తం చేశారు.

వారి మరణం బాధాకరమని వారితో ఉన్న సాన్నిహిత్యాన్ని పువ్వాడ గుర్తు చేసుకున్నారు.

వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధించారు.