కూరపాటి కుటుంబాన్ని ఓదార్చిన నామా
== పలు కుటుంబాలను పరామర్శించిన ఎంపీ నామ
(కూసుమంచి-విజయంన్యూస్)
కూసుమంచి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, ప్రముఖ వ్యాపారవేత్త కూరపాటి వేణు కుటుంబాన్ని పార్లమెంటరీ పార్టీ నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు బుధవారం పరామర్శించారు. ఇటీవలే ఆయన గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చనిపోగా ఆయనకు కన్నీటి పర్వంతం నడుమ అంత్యక్రియలను నిర్వహించారు.
allso read- ప్రజలంతా సుభిక్షంగా వర్ధిల్లాలి: నామా
ఈ విషయం తెలుసుకున్న ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు బుధవారం దశదిన కర్మ కార్యక్రమం జరుగుతుండగా కూసుమంచి మండల కేంద్రంలోని కూరపాటి వేణు నివాసానికి వచ్చి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం వేణు కుటుంబంతో మాట్లాడి వారిని పరామర్శించి దైర్యం చెప్పారు. వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతి వ్యక్తం చేస్తూ, కూరపాటి వేణు ఆత్మకు శాంతిచేకూరలని భగవంతుడ్ని కోరారు.అలాగే ఖమ్మం స్వర్ణ భారతి లో బుధవారం విశ్రాంత ఉద్యోగి, శ్రేయోభిలాషి ఏటుకూరి వెంకటేశ్వర్లు దశ దిన కర్మ కార్యక్రమంలో బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు చిత్ర పటానికి పూల మాల వేసి, శ్రద్ధాంజలి ఘటించి, నివాలర్పించారు.కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. ఇటీవల పాలేరులో మృతి చెందిన రాంబాయమ్మ ఇంటికి వెళ్లి వారి చిత్ర పటానికి పూల మాల వేసి, శ్రద్ధాంజలి ఘటించి, సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమాల్లో రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు,శ్రీయుతులు నామ సీతయ్య , నామ కృష్ణయ్య, కూరపాటి వెంకటేశ్వర్లు, డాక్టర్ ప్రదీప్, కమర్తపు మురళి, ఇంటూరి శేఖర్, మలీదు వెంకన్న , బాణాల వెంకటేశ్వరరావు, చిత్తారు సింహాద్రి యాదవ్, బత్తుల శ్రీనివాసరావు, నామ సేవా సమితి నుంచి పాల్వంచ రాజేష్, చీకటి రాంబాబు, రేగళ్ల కృష్ణ ప్రసాద్, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: కేసిఆర్ మానస పుత్రిక గృహ లక్ష్మి పథకం: మంత్రి