Telugu News

 పేదలకు ‘నామ’ ఆర్ధిక భరోసా

పెద్ద ఎత్తున సీఎంఆర్ఎఫ్      చెక్కులు పంపిణి

0

 పేదలకు ‘నామ’ ఆర్ధిక భరోసా

⏩  పెద్ద ఎత్తున సీఎంఆర్ఎఫ్      చెక్కులు

⏩ పార్టీలకతీతంగా పేదలకు సాయం

⏩ ప్రతి నెలా కోటి విలువైన చెక్కుల పంపిణీ

⏩  నాలుగేళ్లలో రూ.50 కోట్ల సాయం

⏩  నామకు అండగా ఉండాలి

⏩ మూడోసారి కేసీఆర్ ను  గెలిపించుకోవాలి

⏩ ఎంపీ నామ నాగేశ్వరరావు క్యాంప్ కార్యాలయంలో 66 మందికి రూ.21,32,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

⏩ కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన  రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు

ఇది కూడా చదవండి: పత్తి వ్యాపారులను కాపాడండి: నామా

 ఖమ్మం, మే 18(f : బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రత్యేక చొరవ, కృషి వల్ల పేదలకు పెద్ద ఎత్తున సీఎంఆర్ఎఫ్ సాయం అందుతుందని రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో గురువారం ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజక వర్గాలకు చెందిన 66 మందికి మంజూరైన రూ.21,32,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు ఆయా నియోజకవర్గాలకు చెందిన నాయకులతో కలిసి, లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా నల్లమల మాట్లాడుతూ ఎంపీ నామ ప్రత్యేక చొరవతో సీఎంతో మాట్లాడడం వల్ల ప్రతి నెలా కోటీ రూపాయలకు తక్కువ కాకుండా సీఎంఆర్ఎఫ్ సాయం చెక్కుల రూపంలో  పేదలకు అందించడం జరుగుతుందని అన్నారు. ఈ నాలుగేళ్లలో రూ.50 కోట్లకు పైగానే ఎంపీ నామ నాగేశ్వరరావు ద్వారా పేదలకు ఆర్ధిక సాయం అందించడం ఎంతో ప్రశంసనీయమని అన్నారు. మరో వైపు తన తండ్రి నామ ముత్తయ్య పేరుతో ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నామ  ప్రజల మన్ననలు అందుకుంటున్నారని అన్నారు. ఏ పార్టీ అని చూడకుండా అర్హత కలిగిన వారందరికీ సీఎంఆర్ఎఫ్ సాయం అందించడం జరుగుతుందని, గతంలో ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉండేదని, ఫైరవీలు, సిఫార్సులు చేస్తే ఒకరిద్దరికి మాత్రమే సీఎంఆర్ఎఫ్ సాయం అందేదని నల్లమల పేర్కొన్నారు.
నేడు కుల, మత, పార్టీలకతీతంగా భారీ ఎత్తున పేదలకు సాయం అందించడం కేసీఆర్ ప్రత్యేకత అన్నారు. దేశంలోనే తెలంగాణా నెంబర్ వన్ అభివృద్ధితో దూసుకుపోతుందని, ప్రతి ఒక్కరికీ ఏదో రూపంలో లబ్ధి చేకూరుస్తున్న కేసీఆర్ ను రానున్న ఎన్నికల్లో మళ్ళీ గెలిపించుకుని, మూడోసారి సీఎంగా చేస్తేనే మిగిలిపోయిన అభివృద్ధిని చేసుకోగలుగుతామని నల్లమల తెలిపారు. సంక్షేమ పధకాల ద్వారా లబ్దిపొందిన ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి,తమ అభిమానాన్ని, కృతజ్ఞతను చాటుకుని, కేసీఆర్ ను  హ్యాట్రిక్ సీఎం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ క్యాంప్ కార్యాలయం ఇన్చార్జి కనకమేడల సత్యనారాయణ, పార్టీ నాయకులు పోట్ల శ్రీను,తన్నీరు రవి, గోడ్డేటి  మాధవరావు , జిల్లా టెలికాం సలహా మండలి సభ్యులు చిత్తారు సింహాద్రి యాదవ్, ఉప్పునూతల నాగేశ్వరరావు, దిశ కమిటీ సభ్యురాలు చింతలచెర్వు లక్ష్మీ, సింగరేణి మండల నాయకులు బత్తుల శ్రీనివాసరావు, ఏన్కూరు మండలం గార్లోడ్డు సొసైటీ డైరెక్టర్ కొనకంచి వెంకటేశ్వర్లు, నామ సేవా సమితి నాయకులు పాల్వంచ రాజేశ్, చీకటి రాంబాబు, కృష్ణ ప్రసాద్, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.