కొండా లక్ష్మణ్ బాపూజీ కి నామ ఘన నివాళి
లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ, ఎంపీ నామ నాగేశ్వరరావు
కొండా లక్ష్మణ్ బాపూజీ కి నామ ఘన నివాళి
➡️ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ, ఎంపీ నామ నాగేశ్వరరావు
ఖమ్మం, సెప్టెంబర్ 27(విజయం న్యూస్ ):
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణా బిడ్డ కావడం మనందరి అదృష్టమని, ఆయనిప్పుడు బతికుంటే తెలంగాణా అభివృద్ధి చూసి, ఎంతో సంతోశించేవారని బీఆర్ ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి:-గణేష్ ఉత్సవ కమిటీకి ఎంతో చరిత్ర ఉంది : నామ
ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎంపీ నామ, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో నామ నాగేశ్వరరావు మాట్లాదారు. కొండా లక్ష్మణ్ బాపూజీ స్పూర్తితో సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి లో దేశంలో నెంబర్ వన్ గా చేశారని అన్నారు. ఆయన మనందరి నాయకుడని నామ నివాళి అర్పించారు. అంతా ఐక్యంగా ఉండి, రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి, సీఎం కేసీఆర్ కు అండగా ఉండాలన్నారు.
ఇది కూడా చదవండి:- ఖమ్మంలో శోభయాత్రను ప్రారంభించిన మంత్రి
కేసీఆర్ ను మూడోసారి సీఎం గా చేయాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాములు నాయక్, హరిప్రియ నాయక్, ఎమ్మెల్సీ తాతా మధు, జాయింట్ కలెక్టర్ మధుసూదన్, సీపీ విష్ణు వారియర్, రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, పార్టీ వైరా
మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు, కార్పొరేటర్ కమర్తపు మురళి, పద్మశాలీ సంఘం నాయకులు బొమ్మా రాజేశ్వరరావు, నాయకులు చిత్తారు సింహాద్రి యాదవ్, మోరoపూడి ప్రసాద్, నామ సేవా సమితి నాయకులు చీకటి రాంబాబు, కృష్ణ ప్రసాద్ తదితరులుతో పాటు బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి:- ఎంపీ నామ గొప్ప మానవతావాది