Telugu News

నామ అంటేనే ఖమ్మం: తేజ

నామ నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ నామ తనయుడు నామ భవ్య తేజ , మనోఙ్ఞ దంపతులు ఎన్నికల ప్రచారం

0

నామ అంటేనే ఖమ్మం: తేజ

❇️ నామ నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ నామ తనయుడు నామ భవ్య తేజ , మనోఙ్ఞ దంపతులు ఎన్నికల ప్రచారం

(ఖమ్మం -విజయం న్యూస్)

బిఆర్ఎస్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరావు విజయాన్ని కాంక్షిస్తూ నామ తనయుడు రభవ్య తేజ , మనోఙ్ఞ దంపతులుఆదివారం రాత్రి ఖమ్మం నగరంలో విస్తృతంగా. ఎన్నికల ప్రచారం నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్యమైన మంచి స్పందన లభించింది .ప్రతి ఇంటికి వెళ్లిప్రతి గడప తలుపు తట్టి నామ నాగేశ్వరరావు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గురించి వివరించారు. తెలంగాణ ప్రయోజనాలు నెరవే రావాలంటే నామ నాగేశ్వరరావు ను మంచి మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వారు ఓటర్లను కోరగా మంచి స్పందన లభించిందని వారు తెలిపారు ఎక్కడికెళ్లినా ప్రజలు మంచిగా ఆప్యాయంగా పలకరించి స్వాగతం పలికి ఆదరించారని,

అభివృద్ధి ప్రదాత నామ కు ఓటు వేస్తామని గట్టిగా చెప్పారని తెలిపారు. నామ అంటే ఖమ్మం అని, ఖమ్మం అంటే నామ అని ప్రజలు అంటున్నారని , ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నామ నాగేశ్వరరావు ను అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ప్రజల నుంచి భరోసా లభిస్తుందని తెలిపారు. ఈ
ఎన్నికల ప్రచార కార్యక్రమంలో నామ నాగేశ్వరరావు తనయుడు నామ భవ్య తేజ దంపతులతో పాటు మానస్, రమాదేవి, పగడాల
రవి , 49వ డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు .