Telugu News

నేనున్నాంటున్న నామా 

వైద్యఖర్చుల నిమిత్తం కుటుంబానికి రూ.లక్ష చేయూత

0

నేనున్నాంటున్న నామా 
* చిన్నారి వైద్యానికి నామ  భరోసా
* వైద్యఖర్చుల నిమిత్తం కుటుంబానికి రూ.లక్ష చేయూత

ఖమ్మం, జూలై 5 :

ఒక దీపం మరో దీపాన్ని వెలిగించినట్లు పది మంది జీవితాల్లో కాంతిని నింపాలి.. అంతకంటే మనిషి జీవితానికి సార్ధకత లేదని మరో మారు నిరూపించారు ఖమ్మం ఎంపీ, టీఆర్ఎస్ పార్టీ లోక్ సభా పక్ష  నేత నామ నాగేశ్వరరావు. గుండె సంబంధిత వ్యాధితో సతమతమవుతున్న చిన్నారి కుటుంబానికి ఆపన్నహస్తం అందించడమే కాకుండా ఆర్థిక భరోసా కల్పించి, అసరాగా నిలిచారు. నీనున్నాంటూ ఆ నిరు పేద కుటుంబానికి నామ అభయమిచ్చారు.

ఇది కూడా చదవండి :- వైరా ‘కారు’పార్టీలో కుంపటి

గుండెలో రంద్రం పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ చిన్నారి వైద్యానికి అయ్యే ఖర్చులను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు చేయించి, ఆ కుటుంబాన్ని ఆదుకుని, చేయూతనిచ్చారు. ముదిగొండ గ్రామానికి చెందిన వల్లంకొండ రమేశ్ కుమార్తె మెర్సీ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించుకోగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి వెళ్ళాలని సూచించారు. నిమ్స్ లో  పరీక్షల అనంతరం శస్త్ర చికిత్స చేయాలని ఎస్టిమేషన్ ఇచ్చారు. ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రమేష్ ఎంపీ నామను కలసి తన ఆర్ధిక పరిస్థితిని వివరించారు. వెంటనే నామ స్పందించి అతను అందజేసిన దరఖాస్తును సీయం సహాయనిధి కోసం సిఫార్సు చేయగా బాధితుడి చికిత్స కోసం రూ.లక్ష  ఎల్ఓసీ మంజూరైంది. హైదరాబాద్ లోని ఎంపి నామ కార్యాలయంలో మంగళవారం లబ్ధిదారునికి ఎల్ఓసీ ని అందజేశారు. బాలికకు మెరుగైన చికిత్స అందించాలని ఈ సందర్భంగా నామ బాధితునికి భరోసా కల్పించారు. భయపడవద్దని చిన్నారి కుటుంబానికి ధైర్యం చెప్పారు.  ఈ సందర్భంగా లబ్ధిదారుడు ఎంపీ  నామకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇది కూడా చదవండి: – మద్దులపల్లి మార్కెట్ లో అక్రమాలు నిజమెంతా..?