దొడ్డి కొమరయ్యకు నామ నాగేశ్వరరావు నివాళి
== పోరాట యోధులకు సముచిత గౌరవం
న్యూఢిల్లీ / ఖమ్మం ,ఏప్రిల్ 3(విజయంన్యూస్):
తెలంగాణలో భూ స్వామ్య పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు, తెలంగాణ సాయుధ రైతాంగ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో నివాలర్పించి, స్మరించుకున్నారు.దొడ్డి కొమరయ్య జయంతిని ఏప్రిల్ 3న అధికారికంగా నిర్వహించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయమని అన్నారు.ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోరాట యోధులకు సీఎం కేసీఆర్ సముచిత గౌరవం కల్పించారని అన్నారు. దోపిడీ, అణచివేతలను కొమరయ్య సమర్థవంతంగా ఎదుర్కొన్నారని అన్నారు.స్వయం పాలన ఆకాంక్షలకు ఊపిర్లు ఊదారన్నారు.భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం కొమరయ్య ప్రాణాలకు తెగించి ఉద్యమించారన్నారు. నిజాం సంస్థానంలో ప్రజలకు స్వాతంత్య్రం కోసం అలుపెరగని పోరు సల్పి వీర మరణం పొందరన్నారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం …ప్రజల రక్షణ కోసం తుపాకీ తూటాలకు నేలకొరిగిన అరుణతార కొమరయ్య అని, తెలంగాణా విప్లవోద్యమంలో ఆయన చెరగని ముద్ర వేశారని నామ అన్నారు.సమ సమాజ నిర్మాణానికి విప్లవ జ్వాలై పరితపించారన్నారు. దొడ్డి కొమరయ్య స్పూర్తితో ముందుకు పోవడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు.
allso read- జార్ఖండ్ లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు.