Telugu News

సభ సక్సెస్ కు నామా కృషి

సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన ఎంపీ

0
సభ సక్సెస్ కు నామా కృషి
== దేశం అబ్బుర పడేలా అవిష్కృతమైందన్న నామా
== సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన ఎంపీ
ఖమ్మం, జనవరి 21(విజయంన్యూస్):
 సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి, సభ ఇన్చార్జి తన్నీరు హరీష్ రావు నేతృత్వంలో దేశం అబ్బుర పడేలా టీఆర్ఎస్ ఆవిర్భావ సభ మహాద్భుతంగా  సక్సెస్ అవ్వడం జరిగిందని లోక్ సభా పక్ష వేత ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు అన్నారు.  అందరి సమష్టి, సహకారంతో విశేష కృషి చేశారని, తనవంతు పాత్ర అద్భుతమని, అందుకు ధన్యవాదాలు చెబుతున్నట్లు తెలిపారు.  జనవరి 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు కూడా ఎంపీ నామ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాల్లో స్థానిక నాయకత్వంతో కలిసి విస్తృతంగా పర్యటించి, జన సమీకరణకు  నాయకత్వాన్ని అన్ని విధాలా ప్రేరేపించారు.కదలించారు.
నామ పక్కా ప్రణాళికతో ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, ఇల్లెందు నియోజకవర్గాల్లో దావాణంలా పర్యటించి, జన సమీకరణకు స్థానిక నాయకత్వాన్ని సమాయత్తం చేశారు. పక్కా వ్యూహంతో పని చేసి, సభ అన్ని విధాలా సూపర్ సక్సెస్ కావడంలో నామ నఫలీకృతులయ్యారు. తన్నీరు హరీష్ రావుతో పాటు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ ఎంపీలు బండి పార్ధసారధిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షులు తాతా మధుసూదన్, ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్ రెడ్డి, లావుడ్యా రాములు నాయక్, సండ్ర వెంకటవీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమలరాజు నహకారంతో ముందుకెళ్లి, ఆయా నియోజక వర్గాల్లో సుడిగాలి పర్యటనలు జరిపి, పెద్ద ఎత్తున సభ సన్నాహాక సమావేశాలు ఇబ్బడిముబ్బడిగా నిర్వహించి, జన సమీకరణకు నాయకత్వాన్ని సన్నద్ధం చేశారు. వెళ్లిన ప్రతి చోట స్థానిక ఎమ్మెల్యే నిర్దేశకత్వంలో స్థానిక నాయకత్వం సహకారం, చొరవతో పెద్ద ఎత్తున జననమీకరణకు నామ కృషి చేశారు. అంతేకాకుండా స్థానిక నాయకులందర్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చి, వారిని సమన్వయపర్చి,  సమైఖ్య పర్చి సభకు నమాయ త్తపర్చారు. ఖమ్మంలో తొలి బీఆర్ఎస్ నభ నిర్వహణకు సీఎం కేసీఆర్ మూహుర్తం ఖరారు చేయగానే ఎంపీ నామ ఖమ్మంలో పూర్తిస్థాయిలో మకాం పెట్టి, సంక్రాంతి పండుగ రోజుల్లో కూడా మండలాలకు వెళ్లి, జనం మధ్యలోనే గడిపారు. వారి మధ్యే ఉంటూ జన సమీకరణకు విశేషంగా శ్రమించారు.
దాదాపు వారం రోజులు పాటు కీలక బాధ్యతలు తీసుకుని, ప్రజలతో ఉండి, సభ విజయవంతంపై ప్రధానంగా దృష్టి పెట్టారు. తొలి రోజు ఎంపీ నామ పాలేరు నియోజకవర్గంలో పర్యటించి, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక నాయకత్వంతో  సమావేశ మయ్యారు. తర్వాత ఖమ్మంలో మంత్రి క్యాంప్ కార్యాలయం, వైరా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, మధిరలో వానవీ కళ్యాణ మండపం, సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, నత్తుపల్లి మామిడి తోట, కొత్తగూడెం ఎమ్మెల్యే స్వగృహం తదితర చోట్ల ఆయా మండలాల నాయకత్వం,  ప్రజా ప్రతినిధులతో ఎంపీ నామ స్వయంగా భేటీలు జరిపి, జన సమీకరణకు వారిని సమాయత్తం చేశారు. అంతేకాకుండా సత్తుపల్లి ఎమ్మెల్యేను సైతం వెంటబెట్టుకుని, గండుగులపల్లి వెళ్ళి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి, జన సమీకరణపై పూర్తి స్థాయిలో చర్చించడమే కాకుండా సత్తుపల్లి మామిడి తోటలో జరిగిన సన్నాహాక సమావేశానికి తుమ్మలతో సహా హాజరై, స్థానిక నాయకత్వంతో చర్చించారు. ఎంపీ నామ సమిష్టి సహకారంతో గండుగులపల్లిలో తుమ్మల ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.
      తుమ్మల పార్టీ సన్నాహాక సమావేశాలకు హాజరు కావడంతో పాటు పాలేరు నియోజకవర్గం నుంచి ఖమ్మంలో జరిగిన సన్నాహాక సమావేశానికి పెద్ద ఎత్తున హాజరై, ఐక్యత చాటారు. ఎంపీ నామ తన పర్యటనల ద్వారా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆత్మీయులు, నేతలందరిలో నూత నుత్సాహం నింపారు. రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు,ప్రశాంత్ రెడ్డి, వైరా నియోజకవర్గ ఇన్చార్జులు శ్రీధర్ రెడ్డి, క్రాంతి కిరణ్ ( ఎమ్మెల్యే) తో కలిసి, ఖమ్మం, తల్లాడ, కల్లూరు, సత్తుపల్లి, మధిర తదితర ప్రాంతాల్లో పర్యటించి, స్థానిక నాయకత్వాన్ని ముందుకు నడిపించారు. ర్యాలీలు నిర్వహించి, సభ విజయవంతానికి శక్తివంచన లేకుండా శ్రమించారు. అన్ని నియోజక వర్గాల్లో నాయకులంతా సమిష్టిగా పని చేసేలా అందర్నీ ఒక తాటి మీదకు తీసుకువచ్చారని చెప్పవచ్చు.
నామ మండలాలకు, గ్రామాలకు వెళ్ళినప్పుడు స్థానిక ముఖ్య నాయకులంతా ఏకతాటిపైకి వచ్చారు. అలాగే నభ విజయవంతానికి భారీ ఎత్తున జనాన్ని సభకు తరలించుకు వచ్చారు. నామ ఎంతో వ్యూహాత్మకంగా ఆయా నియోజకవర్గాల్లో పర్యటించి, సన్నాహాక సమావేశాలను నిర్వహించి, అంతా సమన్వయంతో ముందుకు నడిచేలా నామ కృషి చేశారు. ఎక్కడికి వెళ్ళినా నామకు స్థానిక నాయకత్వం ఆప్యాయతతో ఘన స్వాగతం పలికి, ఆదరించారు. కేసీఆర్ వెంటే నడుస్తామని భరోసా ఇచ్చారు. 18న సభకు భారీ ఎత్తున జనం తరలిరావడంతో నామ కృషి ఫలించినట్లయింది. సభ అనంతరం రాత్రి ఇంటి వద్ద రాజ్యసభ ఎంపి బండి పార్ధసారధిరెడ్డి, ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షులు తాతా మధునూధన్ తదితర నాయకుల సమక్షంలో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి, సంబురాల్లో నామ పాలుపంచుకున్నారు. సభ ఊహించని విధంగా చరిత్రలో నిలిచే పోయే విధంగా సక్సెస్ చేసినందుకు ఎంపీ నామ ప్రజలకు, సహరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇంతటి కృషి చేయడం వల్లనే సీఎం కేసీఆర్ ఎంపీ నామకు ప్రత్యేకించి, ఫోన్ చేసి, అభినందించారు. ఖమ్మం నభ స్పూర్తితో భవిష్యత్ లో కూడా పని చేయాలని కేసీఆర్ నామతో అన్నారు..