ఖమ్మంలో నామ ఆశీర్వాదాలు.. పరామర్శలు
? రాజేశ్వరపురం లో పర్యటన
ఖమ్మం, డిసెంబర్ 4 : టీఆర్ ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు శ్రీ నామ నాగేశ్వరరావు ఆదివారం స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులతో. కలసి ఖమ్మం నగరంలో విస్తుతంగా పర్యటించి,పలు కార్యక్రమాల్లో పాల్గొని, నూతన జంటలను ఆశీర్వదించారు. పలు కుటుంబాలను పరామర్శించారు. శ్రీనివాస నగర్ లో పాలడుగు పాపారావు – కవిత దంపతుల కుమారుడు అఖిల్ – త్రివేణీ వివాహం సందర్భంగా నూతన దంపతులను నామ ఆశీర్వదించారు.
ALLSO READ- ఖమ్మం ఫారెస్ట్ శాఖకు మరో షాక్
అనంతరం ముస్తఫా నగర్ శ్రీరాం నగర్ 8 వ రోడ్ లో పోటు బిక్ష్మయ్య నూతన గృహ ప్రవేశం సందర్భంగా పూజా కార్యక్రమంలో పాల్గొని, బిక్షమయ్య -సావిత్రి దంపతులను, కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు.జయనగర్ కాలనీలో మందాడి వంశీ నూతన గృహాన్ని సందర్శించి, వంశీ దంపతులను, భూమా పుల్లారావు- విజయలక్ష్మి దంపతుల ఇంటికెళ్లి వారి కుమారుడు వంశీ కృష్ణ అనూష్క నూతన దంపతులను ఆశీర్వదించారు.
అనంతరం బ్యాంక్ కాలనీలో ఇటీవల చనిపోయిన ఏపూరి చిన్నరామలింగయ్య కుటుంబ సభ్యులను, అయితం సత్యం కుటుంబ సభ్యులు అయితం వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను, గుండె ఆపరేషన్ చేయించుకున్న పట్టణ కమ్మ సంఘం అధ్యక్షులు వల్లభనేని రామారావుతో పాటు మృతుడు మేకల భాస్కర్ రావు కుటుంబాన్ని నామ పరామర్శించారు. అనంతరం బైపాస్ రోడ్డులో కార్పొరేటర్ చావా నారాయణరావు ఆధ్వర్యంలో జరిగిన ఆంజనేయ స్వామి గుడి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరై, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వరంగల్ క్రాస్ రోడ్డులోని ఫంక్షన్ హాలులో పార్టీ కూసుమంచి మండల అధ్యక్షులు వేముల వీరయ్య కుమార్తె నిశ్చతార్ధ కా ర్యక్రమాల్లో ఎంపీ నామ పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమాల్లో డిసిసిబి ఛైర్మన్ కూరాకుల నాగభూషణం, రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు,పార్టీ వైరా మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు, చింతకాని ఎంపీపీ పూర్ణయ్య,కార్పొరేటర్ లు శ్రావణి సుధాకర్, చిరుమామిళ్ల లక్ష్మీ, సరిపూడి గోపి, టెలికాం సలహా మండలి సభ్యులు చిత్తారు సింహాద్రి యాదవ్, చీకటి రాంబాబు, రేగళ్ల కృష్ణ ప్రసాద్, తదితరులుతో పాటు ఆయా కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.
== అభివృద్ధి కార్యక్రమాల్లో నామ
టీఆర్ ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు శ్రీ నామ నాగేశ్వరరావు ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి , ప్రజా ప్రతినిధులు, నాయకుల తో కలసి నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం,కూసుమంచి మండలం కేశవాపురం తదితర గ్రామాల్లో పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజేశ్వరపురం లో దండా కిషన్ రావు – స్వరూపరాణి దంపతుల కుమారుడు దుర్గా చరణ్, హేమంత్ సాయి నూతన దంపతులను ఎంపీ నామ ఆశీర్వదించారు. అనంతరం అదే గ్రామంలో రూ.25 లక్షలతో సొసైటీ ఆఫీసు అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాల్లో ప
పాల్గొన్నారు.తర్వాత కేశవాపురంలో బెల్లం కృష్ణమూర్తి – పద్మ దంపతుల పెద్ద కుమారుడు నూతన వరుడు రాజేష్ ను ఎంపీ నామ ఆశీర్వదించారు.ఈ సాయంత్రం రాజేష్ వివాహం చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమాల్లో డిసిసిబి ఛైర్మన్ కూరాకుల నాగభూషణం, రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ నంబూరి శాంత, జెట్పీ ఉపాధ్యక్షురాలు మరికంటి ధనలక్ష్మి, ఎంపీపీ వజ్జా రమ్య శ్రీనివాసరావు, పార్టీ మండల అధ్యక్షులు బ్రహ్మయ్య , రాజేశ్వరపురం సొసైటీ ఛైర్మన్ తన్నీరు కృష్ణమూర్తి,వైస్ ఛైర్మన్ అడపాల రవీందర్, ఎంపీటీసీ చంద్రమ్మ, సర్పంచ్ దండా పుల్లయ్య, ఏఇవో నిఖిల, సింహాద్రి యాదవ్, చీకటి రాంబాబు, రేగళ్ల కృష్ణ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.