Telugu News

నామ రైతు బిడ్డ..గెలిపించండి: రవిచంద్ర 

కూసుమంచి లో రోడ్ షోలో మాట్లాడిన ఎంపీ రవిచంద్ర

0
నామ రైతు బిడ్డ..గెలిపించండి: రవిచంద్ర 
== ఎల్లప్పుడూ రైతులకు మేలు చేసే అవకాశం ఉంది
== ఖమ్మం జిల్లా శాంతికి, చైతన్యానికి మారుపేరు 
== కూసుమంచి లో రోడ్ షోలో మాట్లాడిన ఎంపీ రవిచంద్ర
(కూసుమంచి -విజయం న్యూస్)
*రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ ఖమ్మం లోకసభ నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డిలతో కలిసి కూసుమంచి రోడ్ షోలో మాట్లాడారు.పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగిన ఈ రోడ్ షోకు గులాబీ శ్రేణులు,స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ ఖమ్మం జిల్లా శాంతికి, చైతన్యానికి మారుపేరు.  అధికార పార్టీ నాయకులు బీఆర్ఎస్ వారిపై కేసులు పెట్టి, బెదిరించి శాంతికి భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తే ప్రజలు సహించరు. మన అభ్యర్థి నామ నాగేశ్వరరావు స్థానికులు, ఇక్కడికి సమీపానే షుగర్ ఫ్యాక్టరీ ఉంది.‌నష్టాలలో ఉన్నా కూడా ఇక్కడి వారి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దెబ్బతినకూడదని నడిపిస్తున్నరు.‌నామ రైతు బిడ్డ రైతులకు మేలు చేస్తున్నరు
‌.మన అభ్యర్థి నామ ఖమ్మం లోనే ఉంటూ అందరికి అందుబాటులో ఉంటరు,పిలిచిందే తడువుగా వస్తరు,పనులు చేస్తరు. కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం ఎవరికి కూడా అందుబాటులో ఉండరు,ఆయన ఎక్కడ ఉంటరో ఎవరికి కూడా తెలియదు. మన అభ్యర్థి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ను ఒప్పించారు. పార్లమెంటులో మన గళం బలంగా వినిపించారు, తెలంగాణ కోసం మొదటి ఓటు వేశారు. ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ 12సీట్లు గెలుచుకోవడం ఖాయం,అందులో నామ నాగేశ్వరరావు భారీ మెజార్టీ ఓట్లతో విజయం సాధిస్తరు.
తెలంగాణ ప్రజల న్యాయమైన హక్కుల సాధనకు పార్లమెంటులో కొట్లుడతరు. బయ్యారం ఉక్కు కర్మాగారం, ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వని కేంద్ర ప్రభుత్వంపై పోరాడి సాధిస్తరు. మనమందరం ఈ 11రోజులు బాగా కష్టించి నామను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం