Telugu News

నామ అంటే భరోసా !

పండుగ వాతావరణంలో  చెక్కుల పంపిణీ

0

నామ అంటే భరోసా !

➡️ పండుగ వాతావరణంలో  చెక్కుల పంపిణీ

➡️నామ చొరవతో పేదలకు సాయం

➡️ మూడోసారి కేసీఆర్ నే సీఎం

➡️ రానున్న ఎన్నికల నుంచే మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలి

👉 ఎంపీ క్యాంప్ కార్యాలయంలో  నామ నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో 31 మందికి మంజూరైన రూ.14,45,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో నల్లమల వెంకటేశ్వరరావు

ఖమ్మం, సెప్టెంబర్ 21(విజయంన్యూస్):
 ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రత్యేక చొరవ , చేయూత వల్ల  పేద, మధ్య తరగతి ప్రజలకు పెద్ద ఎత్తున సాయం అందుతుందని రైతు బంధు జిల్లా సమన్వయ సమితి అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఎంపీ నామ కృషితో 31 మందికి మంజూరైన రూ. 14,45,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను గురువారం ఖమ్మంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయం నల్లమల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నల్లమల మాట్లాడుతూ నామ అంటే ఒక భరోసా అన్నారు.పేదలకు అవకాశం ఉన్నంత వరకు సాయం అందించడమే నామ లక్ష్యమన్నారు.ప్రతి వారం ఎంపీ క్యాంప్ కార్యాలయంలో పండుగ వాతావరణం లో సీఎం ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు.

గత ప్రభుత్వంలో సీఎంఆర్ఎఫ్ సాయం అందరికీ అందేది కాదని, ఎవరికో ఒకరిద్దరికీ ఫైరవీతో అందేదని, కానీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం లో దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికీ ఈ పథకం కింద పార్టీలక్షతీతంగా  సాయం అందించడం జరుగుతుందని అన్నారు. ప్రతి కుటుంబానికి ఏదో పధకం  రూపంలో  లబ్ది చేకూరుతుందని అన్నారు. చేసిన మేలు మర్చిపోకుండా రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలిచి, మూడోసారి కేసీఆర్ ను సీఎంగా చేసుకోవాలని పేర్కొన్నారు. మళ్లీ కేసీఆర్ సీఎం అయితేనే మిగిలిపోయిన అభివృద్ధి పనులను చేసుకోగలుగుతామని అన్నారు.  అభివృద్ధిలో తెలంగాణా  దేశంలోనే నెంబర్ వన్ గా దూసుకు పోతుందన్నారు. ప్రజల కోసం పని చేసే బీఆర్ఎస్ పార్టీకి పట్టం గట్టి, మరింత అభివృద్ధికి  అవకాశం కల్పించాలని అన్నారు. చారిత్రాత్మకమైన  మహిళా బిల్లును స్వాగతిస్తూ రానున్న ఎన్నికల నుంచే మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలని   నల్లమల  వెంకటేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ  క్యాంప్ ఆఫీస్ ఇంచార్జ్ కనకమేడల సత్యనారాయణ, జిల్లా టెలికాం సలహా మండలి సభ్యులు చిత్తారు సింహాద్రి యాదవ్, మధిర మార్కెట్ కమిటీ డైరెక్టర్ వంకాయలపాటి లచ్చయ్య , ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం ఎంపీటీసీ  నాయకులు మాధవి కిరణ్,  యాదవ సంఘం నాయకులు ధనియాకుల వీరాస్వామి, పాపారావు,  సామాజిక వేత్త శేషయ్య, నాయకులు గోడ్డేటి  మాధవరావు, వాకదాని కోటేశ్వరరావు, గాంధీనగర్ సర్పంచ్ లలిత దేవి  డేవిడ్, నామ సేవా సమితి నాయకులు పాల్వంచ రాజేష్, చీకటి రాంబాబు, రేగళ్ల కృష్ణ ప్రసాద్, మునిగంటి భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.