Telugu News

ఖమ్మం టీడీపీ ఆఫీస్ కు బీఆర్ఎస్ అభ్యర్థి నామ

== తెలుగుదేశం నేతలు నాకు సపోర్ట్ చేయండి: నామా

0
ఖమ్మం టీడీపీ ఆఫీస్ కు బీఆర్ఎస్ అభ్యర్థి నామ
== ఘనంగా స్వాగతం పలికిన తెలుగు తమ్ముళ్లు 
== తెలుగుదేశం నేతలు నాకు సపోర్ట్ చేయండి: నామా
(ఖమ్మం -విజయం న్యూస్)
 విచిత్ర సంఘటనలు చోటుచేసుకున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏ పార్టీకి ఇప్పటివరకు సపోర్ట్ చేయకపోవడంతో ఇటీవలే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురాంరెడ్డి తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీడీపీ పార్టీ జిల్లా కార్యాలయంకు వెళ్లి తెలుగు తమ్ముళ్లను కలిసి మాతో కలిసి రావాలని, కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు చెప్పాలని కోరారు. ఆ తరువాత శనివారం ఖమ్మం తెలుగు దేశం పార్టీ ఆఫీసు కు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు వెళ్ళారు.
ఖమ్మంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా
త్వరలో జరగబోయే లోకసభ ఎన్నికల ఓట్ల అభ్యర్థన కోసం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చిన టిఆర్ఎస్ లోకసభ  నామా నాగేశ్వరావు పార్టీ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా ఆయనకి ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షుడు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం ఉపాధ్యక్షులు తేల చెన్నయ్య కొండ బాల కర్ణాకర్ ఖమ్మం నగర అధ్యక్షుడు వడ్డేం విజయ్ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి గుత్తా సీతయ్య రాష్ట్ర కార్యదర్శి నాగెండ్ల మురళి తెలుగు యువత అధ్యక్షులు నల్లమల రంజిత్ మహిళా నాయకురాలు మందపల్లి రజిని మేకల సత్యవతి  చుండూరి రాజరాజేశ్వరి తాళ్లూరి అప్పా రావు గుండె పిన్ని నాగేశ్వరావు సానబోయిన శ్రీనివాస్ గౌడ్ మందపల్లి కోటేశ్వరావు తాడిశెట్టి స్వాతి ఖమ్మం నగరంలోని డివిజన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు