ఖమ్మం లో నామ పర్యటన
⏩ నూతన వధూవరులకు ఎంపీ నామ దీవెనలు
ఖమ్మం, మే 14(విజయంన్యూస్):
బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ఆదివారం ఖమ్మం నగరంలో విస్తృతంగా పర్యటించి, పలు వివాహాలకు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. బైపాస్ రోడ్డులో ఆర్ ఆర్ ఆర్ ఫంక్షన్ హాలులో కల్లూరు ఏసీపీ రామానుజం సోదరుడు కృష్ణ ప్రసాద్ – నాగమణి వివాహానికి హాజరై , నూతన జంటను దీవించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బోనకల్ రోడ్డులోని లక్ష్మీ గార్డెన్ లో డాక్టర్ వేము గంగరాజు, విజయ కుమార్తె తేజస్వి – కళ్యాణ్ వివాహానికి హాజరై, నూతన వధూవరులను దీవించారు.కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు బొమ్మెర రామ్మూర్తి, పార్టీ వైరా మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు, పోలోజు సుధాకర్ చారి, రామోజీ రమేష్, సోషల్ మీడియా వైరా నియోజక వర్గ ఇంచార్జి సింగవరపు నరేష్, నామ సేవా సమితి నాయకులు పాల్వంచ రాజేష్, చీకటి రాంబాబు, కృష్ణ ప్రసాద్, చాపలమడుగు సన్నీ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే: నామా