Telugu News

మున్నేరు రివర్ ఫ్రంట్ గా నామకరణం:మంత్రి

గడచిన తొమ్మిదేళ్ళ క్రితం ఖమ్మం ఎలా ఉంది.. నేడు ఎలా ఉంది

0

మున్నేరు రివర్ ఫ్రంట్ గా నామకరణం:మంత్రి

== బీఆర్ఎస్ ప్రభుత్వం కు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నా..

== గడచిన తొమ్మిదేళ్ళ క్రితం ఖమ్మం ఎలా ఉంది.. నేడు ఎలా ఉంది

(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)

ఖమ్మం నగరం 12వ డివిజన్ రాధాకృష్ణ నగర్లోని శ్రీ తులసి వనంలో అపార్ట్మెంట్ నందు పోలవరపు శ్రీకాంత్, మన్నే కిషోర్ కుమార్ అధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు.

ఖమ్మం నగరంలో నివాసం ఉండేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.

ఇక్కడ ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు, వసతులు ఏర్పాటు చేయడం వల్ల ఇటీవలే కాలంలో కమ్యూనిటీ లివింగ్ కి ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు..

ఇది కూడా చదవండి:-;సంక్షేమంలో దేశంలో తెలంగాణ నెంబర్ వన్:మంత్రి

ఒక అధ్యయనం ప్రకారం గడచిన ఐదేళ్ల క్రితం ఖమ్మం నగరంలో 88 అపార్ట్మెంట్ లు ఉంటే.. అది నేడు 700 కు పైగా పెరిగాయి.

ఇదంత ఖమ్మం నగరంలో జరిగిన అభివృద్దే కారణం. ప్రజా అవసరాలు గుర్తించి కోట్లాది రూపాయలు వెచ్చించి రోడ్లు, డ్రైన్ లు, మార్కెట్ లు, లకారంలో పలు ఆహ్లాద క్రీడలు, మినీ పార్కులు, ఆట స్థలాలు, ఓపెన్ జిమ్ లు, ఇలా అనేకం ప్రజలకు అందించాం.

మళ్ళీ ఖమ్మంకు కొత్తగా మున్నేరు వద్ద మున్నేరు రివర్ ఫ్రంట్ గా నామకరణం చేసినం. ఖమ్మం ప్రజలకు మంచి ఆహ్లాద వాతావరణంతో త్వరలో అందించబోతున్నం. మొన్ననే అక్కడ రూ.900 కోట్ల పనులకు మంత్రి కేటిఆర్  శంకుస్థాపన చేశారు.

ఖమ్మం నియోజకవర్గం కు అనుకుని ఉన్న మండలాలు, గ్రామాల నుండి ప్రజలు తమ పిల్లల చదువులు, వైద్యం, ప్రభుత్వం కల్పించిన మౌళిక వసతులు ఇలా అనేక అవసరాల రీత్యా ఖమ్మం నగరంలో నివాసం ఉంటున్నారు.

ఇది కూడా చదవండి:- పార్టీని నడపలేని దద్దమ్మ రాహుల్ గాంధీ: మంత్రి

తద్వారా నగరం వేగంగా విస్తరిస్తూన్నప్పటికి వారందికి కావాల్సిన సదుపాయాలు అన్ని ఎర్పాటు చేస్తున్నాం.

ఇవన్నీ ప్రజలు అర్దం చేసుకోవాలి.. గడచిన తొమ్మిదేళ్ళ క్రితం ఖమ్మం ఎలా ఉంది.. నేడు ఎలా ఉంది.. ఇంత అభివృద్ది ఎప్పుడైనా ఊహించారా.

మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ను గెలిపించిన ఇంతకు రెండింతల అభివృద్ధిని చూస్తారు.. అభివృద్ది కోసం కోట్ల రూపాయలు ఇచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ ఒక్కటే..

ఇది కూడా చదవండి:- చచ్చిన పీనుగు కాంగ్రెస్ పార్టీ: మంత్రి కేటీఆర్

రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నా..

ఆత్మీయ సమ్మేళనంలో మేయర్ పునుకొల్లు నీరజ, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, కార్పొరేటర్ చిరుమామిళ్ళ లక్ష్మీ నాగేశ్వరరావు, వల్లభనేని రామా రావు, నంబూరి ప్రసాద్, దెవభక్తుని హేమంత్, దిలీప్ చౌదరి, రమేష్, సుబ్బారావు, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.