Telugu News

వైభవంగా నరసింహస్వామి కళ్యాణం.

మండల పరిధిలోని గార్లఒడ్డు దేవాలయంలో సోమవారం రాత్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది.

0

వైభవంగా నరసింహస్వామి కళ్యాణం.

(ఏన్కూరు – విజయం న్యూస్):-

మండల పరిధిలోని గార్లఒడ్డు దేవాలయంలో సోమవారం రాత్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం 6 గంటల సమయంలో స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం రాత్రి 8 గంటల 45 నిమిషాలకు వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి తిరు కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు.మంగళవారం సాయంత్రం స్వామి వారి ఊరేగింపు కార్యక్రమాన్ని మేళతాళాల మధ్య ఘనంగా జరిపారు.

ALSO READ :-చిదంబరం ఇళ్ళు, ఆఫీసుల్లో సీబీఐ సోదాలు.

ALSO READ:- కాల్షియం కార్బైడ్ పండ్లు ప్రాణాంతకాలు

ఈ కార్యక్రమంలో దొరబాబు దంపతులు తో పాటు సొసైటీ అధ్యక్షుడు శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, గ్రామ సర్పంచ్ భూక్య కాంతి, దేవస్థానం ధర్మకర్త మద్దికుంట నరసింహారావు, ఏఎంసీ మాజీ చైర్మన్ భూక్య లాలు, మాజీ ఎంపిటిసి వర శంకర్ ప్రసాద్, భూక్యా బాలాజీ ,అర్చకులు వేణుగోపాలాచార్యులు, నాగరాజ్ ఆచార్యులు, కిరణ్ చార్యులు, పవన్ చార్యులు ,రామకృష్ణ చార్యులు, రామాచారి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.