నరసింహుల గూడెం ఎత్తిపోతల పథకం 2 నుండి నీటి విడుదల …
(కూసుమంచి-విజయంన్యూస్):-
మండలంలోని నరసింహుల గూడెం ఎత్తిపోతల పథకం 2 నుండి సోమవారం నీటిపారుదల శాఖ అధికారులు సాగునీటిని విడుదల చేశారు. గత సంవత్సరం పైబడి ఎత్తిపోతల మిషన్లు మరమ్మతులకు గురై పనిచేయకపోవడంతో నీటిని విడుదల చేయలేదు . ఎత్తిపోతల పథకము కు పాలేరు జలాశయం నీటిని ఆయకట్టు 1682ఎకరాలకు 24.8 క్యూసెక్కుల నీటిని వినియోగించుకునే సామర్థ్యం కలిగి. 50 హెచ్ పి 1 మోటర్. 20 హెచ్పి 2 మోటర్లు. 20 హెచ్ పి.1 మోటార్ మొత్తం 4. మోటార్లు ఉన్నాయి.
also read :-*మాకు న్యాయం చేయండి : మంత్రి హారీష్ రావును కలిసిన పాలేరు నియోజకవర్గ రైతులు
ఈ విషయంపై రైతులు పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కోరగా ఆయన వెంటనే నీటిపారుదల శాఖ అధికారులను రైతులకు నీరు ఎత్తిపోతల పథకం ద్వారా అందించాలని ఆదేశించగా అధికారులు గత కొన్ని రోజుల నుండి మరమ్మతులు చేసిన అనంతరం సోమవారం నాడు డీఈ ఈ బాణాల రమేష్ రెడ్డి నీటిని విడుదల చేశారు . ఈ నీటిని కూసుమంచి గంగాదేవి చెరువు .కిష్టాపురం చెరువు. తోపాటు. జీళ్ళచెరువు చెరువు. చేగొమ్మ చెరువులకు అందించనున్నారు. నీటిని విడుదల చేసిన అనంతరం రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కి మరియు ప్రభుత్వ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తరామదాసు ప్రాజెక్టు పవర్ సొల్యూషన్ ఎలక్ట్రికల్ ఇంచార్జ్ డి. సురేష్ తదితరులు పాల్గొన్నారు