Telugu News

తెలంగాణ రవాణా శాఖకు జాతీయ స్థాయి అవార్డు.

రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం.

0

తెలంగాణ రవాణా శాఖకు జాతీయ స్థాయి అవార్డు.

రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం.

(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్):-

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ కు పౌరసేవల్లో ‘ఆర్డర్ ఆఫ్ మెరిట్’ స్కోచ్ అవార్డు వరించింది. రవాణా శాఖలో ఎక్కడైనా,ఎప్పుడైనా (ఎనీ వేర్ ఎనీ టైం) సేవలకు గానూ డిజిట‌ల్ ఆన్‌లైన్ ద్వారా సేవలు అందించినందుకు ఈ అవార్డు లభించింది.

ఈ పురస్కారాన్ని రవాణా శాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు స్వీకరించారు. వివిధ విభాగాల్లో పనితీరును కొలమానంగా తీసుకుని ప్ర‌భుత్వ శాఖ‌లు, సంస్థ‌ల‌కు ఉత్త‌మ పుర‌స్కారాల‌ను స్కోచ్ గ్రూపు అంద‌జేస్తుంది. జాతీయ స్థాయిలో స్కోచ్‌ అవార్డును ర‌వాణా శాఖ ద‌క్కించుకోవ‌డం పట్ల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తమ సేవలు అందిస్తున్న అధికారులను మంత్రి అభినందించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ రవాణా శాఖలో చాలా వరకు పారదర్శక, సౌకర్యవంతమైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రవాణా శాఖ అందుబాటులోకి తీసుకొచ్చిన 17 ఎనీ వేర్, ఎనీ టైం ఆన్ లైన్ సేవలు వినియోగదారులకు మరింత సౌలభ్యంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.

also read :-రాష్ట్రస్థాయి ఫ్లోర్ బాల్ క్రీడలలో యువకుల సత్తా.