Telugu News

జాతీయ స్థాయికి ఎంపికైన కూసుమంచి పిహెచ్ సీ

క్వాలిటీ వైద్యం విషయంలో ఆరు డిపార్ట్ మెంట్ లో ఎంపికైన కూసుమంచి PHC

0

జాతీయ స్థాయికి ఎంపికైన కూసుమంచి పిహెచ్ సీ

== క్వాలిటీ వైద్యం విషయంలో ఆరు డిపార్ట్ మెంట్ లో ఎంపికైన కూసుమంచి PHC

== మామిళ్ళగూడెం PHC కి జాతీయ స్థాయికి ఎంపిక

(కూసుమంచి-విజయం న్యూస్)
ఖమ్మం జిల్లా కూసుమంచి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అరుదైన ఘనత దక్కింది.. క్వాలిటీ వైద్యం విషయంలో జాతీయ స్థాయికి ఎంపిక చేసినట్లు నేషనల్ హెల్త్ మిషన్ జాయింట్ సెక్రటరీ విశాల్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా బెస్ట్ క్వాలిటీ వైద్యం, పరిశుభ్రత, మెరుగైన సౌకర్యాలు, ప్రజలతో సంబంధాలు..

Allso read:- ధాన్యం తరుగు తీస్తున్న రైస్ మిల్ సీజ్

ప్రజారోగ్య పరిస్థితులపై మంచి పేరు పొందిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నేషనల్ ఆరోగ్య మిషన్ ఎంపిక చేసింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 9 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎంపిక చేయగా ఖమ్మం జిల్లా నుంచి రెండు పీహెచ్ సీ లు ఎంపికయ్యాయి. అందులో కూసుమంచి పిహెచ్ సీ, మరోకటి ఖమ్మం నగరంలో మామిళ్ళగూడెం యూపీహెచ్ సీ లను ఎంపిక చేసి రాష్ట్ర హెల్త్ అధికారికి ఉత్తర్వులు జారీ చేశారు. కూసుమంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 6 విభాగాల్లో బెస్ట్ క్వాలిటీ వైద్యాన్ని అందించినట్లుగా నేషనల్ హెల్త్ మిషన్ జాయింట్ సెక్రటరీ విశాల్ చౌహాన్ ఉత్తర్వులు పేర్కొన్నారు.

Allso read:- సత్తుపల్లి లో దారుణం..ముగ్గురు మృతి

81.33% పాయింట్స్ సాధించి జాతీయ స్థాయికి ఎంపికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నేషనల్ హెల్త్ మిషన్ జాయింట్ సెక్రటరీ విశాల్ చౌహాన్ శుభాకాంక్షలు తెలిపారు. NQAS ప్రోగ్రాం కు ఎంపికైనట్లు ఆయన తెలిపారు.

కూసుమంచి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇప్పటికే అనేక అంశాల్లో ఎంపికైంది. కరోనా సమయంలో మండల వైద్యాధికారి గా పనిచేసిన డాక్టర్ శ్రీనివాస్, సిబ్బంది అద్భుతంగా సేవలందించి ప్రభుత్వాసుపత్రి పై ప్రజలకు నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచారు.

Allso read:- కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం: భట్టి విక్రమార్క

అలాగే ఆసుపత్రికి మెరుగైన సౌకర్యాలను దాతల సహాయంతో అందించి ఆసుపత్రి రూపురేఖలు మార్చేశారు. ఆ తర్వాత ఆయన పై చదువుల నిమిత్తం లీవ్ లో వెళ్ళగా ఆయన స్థానంలో వచ్చిన మండల వైద్యాధికారి డాక్టర్ కిషోర్, సిబ్బంది అదే స్థాయిలో విధులు నిర్వహిస్తూ ప్రజలకు గ్రామీణా స్థాయిలో మెరుగైన వైద్యసేవలను అందిస్తున్నారు. వారి కష్టానికి ఫలితంగా కూసుమంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జాతీయ స్థాయికి ఎంపికైంది.