జాతీయ విజ్ఞాన దినోత్సవ శుభాకాంక్షలు: మంత్రి
(ఖమ్మం -విజయం న్యూస్);-
జాతీయ విజ్ఞాన దినోత్సవం (సైన్స్ డే) సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శాస్త్రవేత్తలకు ఔత్సాహికులకు శుభాకాంక్షలు తెలిపారు. సైన్స్ రంగంలో అగ్రగామిగా పని చేస్తున్న ఆవిష్కర్తలందరిని మంత్రి అభినందించారు.
also read :-కొంచెం సృజనాత్మకతతో ఆలోచించండి
రాష్ట్రంలో పరిశోధన ఆవిష్కరణల కోసం మరింత పటిష్టమైన వాతావరణాన్ని సృష్టించేందుకు సీఎం కేసిఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తున్నదని మంత్రి అజయ్ పేర్కొన్నారు. సమిష్టి శాస్త్రీయ బాధ్యతను నెరవేర్చడంలో మరియు మానవ పురోగతికి సైన్స్ యొక్క శక్తి వినియోగం పట్ల నిబద్ధతను పునరుద్ఘాటిద్దామని వివరించారు. ప్రతిఒక్కరూ తమ పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని మంత్రి కోరారు.
ఆర్థికవృద్ధి, సామాజిక అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ శాస్త్ర పరిశోధనకు ప్రధాన లక్ష్యాలుగా ఉండాల్సిన అంశాలు అని, ప్రస్తుత ప్రపంచీకరణ పరిస్థితుల్లో సాంకేతిక పరిజ్ఞానం పరిఢవిల్లడం, డేటా అనలిటిక్స్, యంత్రాలు, రోబోల వాడకం పెరుగుదల, పరిశ్రమల్లో యాంత్రికీకరణ, ఇతర గ్రహాలకు ప్రయాణాలు, జీవవైద్య ఇంజినీరింగ్ తదితర రంగాల్లో విజయాలు వంటివి విజ్ఞానశాస్త్ర పరిశోధన ప్రాముఖ్యతను తెలియజేస్తాయని ఈ క్రమంలో యువత శాస్త్ర పరిశోధనల దిశగా ముందుకు సాగాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు.
also read :-కష్టాలు వచ్చిన ఎప్పుడు చిరునవ్వు తో స్వాగతం పలికే మహానుభావుడు మన రతన్ టాటా
సాంకేతిక వైజ్ఞానిక రంగంలో ప్రగతి పథాన పురోగమిస్తూ మానవులు మహనీయులు అవ్వటానికి కారణం సైన్స్ అని, ఎంతో మంది శాస్త్రవేత్తల కృషి ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న విలాసావంతమైన జీవన పయనమన్నారు. రాళ్ల రాపిడితో నిప్పును పుట్టించిన దశ నుంచి ఈనాటి రాకెట్ యుగం వరకు మార్పులన్నీ వైజ్ఞానిక రంగం విజయాల ఫలితమేనని మంత్రి స్పష్టం చేశారు. భారత ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త సి.వి.రామన్- ‘రామన్ ఎఫెక్ట్’ ను కనుగొన్న ఫిబ్రవరి 28వ తేదీని ఏటా ‘జాతీయ సైన్స్ దినం’గా జరుపుకొంటున్న సందర్భంగా వారి గొప్ప సేవలను, ఆవిష్కరణలను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గుర్తు చేసుకున్నారు.