Telugu News

ఆమ్ ఆద్మీ పార్టీకి  జాతీయ హోదా: మనీశ్ సిసోడియా

 గుజరాత్‌ ఫలితాల అనంతరం ట్విట్ చేసిన  ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా

0

ఆమ్ ఆద్మీ పార్టీకి  జాతీయ హోదా: మనీశ్ సిసోడియా

== గుజరాత్‌ ఫలితాల అనంతరం ట్విట్ చేసిన  ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా

ఢిల్లీ, డిసెంబర్‌8(విజయంన్యూస్):

ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా లభించిందా..? ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో సర్కార్ ను స్వంతం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ మరో రెండు రాష్ట్రాల్లో సీట్లు సాధించి జాతీయ హోదాను దక్కించుకుందా..? అది నిజమేనంటూ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ట్వీట్ చేశారు. గురువారం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైయ్యిాయి. ఈ ఫలితాల్లో ఆఫ్ అంచనాలకు తగిన ఫలితాలు రాలేదు. ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా హోరాహోరీగా ప్రచారం చేసిన ఆమ్ అద్మీ పార్టీ ఆ స్థాయి అంచనాలను అందుకోలేకపోయింది.. కేవలం 5 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ పార్టీ 157 సీట్లను సాధించి అతిపెద్ద మెజారిటీతో 7వ సారి ప్రభుత్వాన్ని నెలకొల్పనుంది.

ఇది కూడా చదవండి: హిమాచల్ ప్రదేశ్ లో హోరాహోరీ ఫలితాలు

కానీ ఆఫ్ మాత్రం అందుకు బిన్నంగా రివర్స్ గేర్ వేసింది. సుమారు 150 కంటే ఎక్కువ స్థానాల్లో పోటీలో నిలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలైయ్యారు. ఐదుగురంటే ఐదుగురు, వారు కూడా స్వల్ప మెజారిటీతో గెలిచారు. దీంతో ఆఫ్ పెద్ద ప్రభావమే చూపించకపోయినప్పటికి ప్రధాని నరేంద్రమోడీ స్వరాష్ట్రంలో 0 నుంచి ప్రారంభమై ఐదు స్థానాలను దక్కించుకోవడం గిొప్ప అని ఆ పార్టీ ’ఆమ్‌ ఆద్మీ పార్టీ’ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా గురువారం తెలిపారు.  ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. గుజరాత్ లో వచ్చిన ఓట్లతో ’ఆప్‌’ జాతీయ పార్టీ కాబోతున్నదని,  దేశంలో తొలిసారిగా విద్య, ఆరోగ్యం ఆధారంగా రాజకీయాలకు దేశంలో గుర్తింపు లభిస్తోంది. భారత దేశ ప్రజలకు అభినందనలు అని సిసోడియా ట్వీట్‌ చేశారు. తొలి ఓట్ల లెక్కింపులో ఆప్‌ 144 అసెంబ్లీ స్థానాల్లో ముందుండగా, కాంగ్రెస్‌ కేవలం 20 స్థానాల్లో ముందుండి చాలా వెనుకబడ్డది. ఆప్‌ తన తీవ్ర ప్రచారంతో గుజరాత్‌లో త్రికోణ పోటీని సృష్టించింది. ఢిల్లీ, పంజాబ్‌లో ఆప్‌ ప్రభుత్వాలు రాష్ట్ర స్థాయి పార్టీ హోదాను స్థిరపరిచాయి. కాగా ఇప్పుడు గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు దానికి జాతీయ పార్టీ హోదాను అందించబోతోంది. ఓ రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కనీసం నాలుగు రాష్టాల్ల్రో గుర్తింపు పొందాల్సి ఉంటుంది. అదే రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే కనీసం రెండు సీట్లు గెలవాలి, ఆరు సీట్లు సాధించాల్సి ఉంటుంది. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత, ఆప్‌ పార్టీ ఢిల్లీ, పంజాబ్‌, గోవా, గుజరాత్‌ రాష్టాల్ల్రో అంటే నాలుగు రాష్టాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందుతుంది. దాంతో ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ స్థాయి పార్టీ స్థాయికి ఎదగనున్నది.

ఇది కూడా చదవండి: పంచాయితీ ట్రాక్టర్‌ను అమ్మకానికి పెట్టిన సర్పంచ్