జర్నలిస్టుల సమస్యలపై దేశవ్యాప్తంగా ఆందోళన: విరహత్ అలీ
అక్టోబర్ 2న ధర్నాలు, ఆందోళనలు చేయాలని ఐజేయు పిలుపు
జర్నలిస్టుల సమస్యలపై దేశవ్యాప్తంగా ఆందోళన: విరహత్ అలీ
== అక్టోబర్ 2న ధర్నాలు, ఆందోళనలు చేయాలని ఐజేయు పిలుపు
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
జర్నలిస్టుల హక్కులు,సమస్యలపై అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున దేశవ్యాప్తంగా ఆందోళన చేసేందుకు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపునిచ్చందని ఆరోజు తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టాలని విరాహాత్ అలీ పిలుపు నిచ్చారు. శుక్రవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన టి యు డబ్ల్యు జె ఐజెయు జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పాత్రికేయులకు న్యాయస్దానం అయిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఎత్తివేసేందుకు, వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాలను రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని దీనికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని పాట్నాలో జరిగిన జాతీయ కౌన్సిల్ సమావేశంలో తీర్మాణం చేయడం జరిగిందన్నారు.
ఇది కూడా చదవండి: జర్నలిజం ముసుగులోని అసాంఘీక శక్తులపై తరిమెద్దాం : ఐజేయు
జర్నలిజంలో మహిళల ప్రాతినిధ్యం పెరగాలనే ఉద్దేశ్యంతో రానున్న అక్టోబర్ 14న జాతీయ స్దాయిలో మహిళ సదస్సును ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు.రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇళ్ళ స్ధలాలు పంపిణీ చేయాలని,హెల్త్ కార్డులు అన్ని కార్పోరేట్ ఆసుపత్రులో చెల్లుబాటు అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని ఇటివల రాష్ట్ర కమిటి ఇచ్చిన పోస్టు కార్డు ఉద్యమానికి మంచి స్పందన లభించిందని సుమారు పదివేల పోస్టుకార్డులు ప్రగతి భవనం కు చేరాయన్నారు.త్వరలో మారోరూపంలో ఉద్యమకార్యచరణకు పిలుపు నివ్వడం జరుగుతుందన్నారు.ఇళ్ళ స్ధలాల విషయంలో స్దానిక ఎమ్మెల్యేలపై వత్తిడి పెంచాలని, వారి చొరవ వల్లనే సాధ్యం అవుతుందన్నారు.రాష్ట్రంలో ఇప్పటి వరకు 2600మంది జర్నలిస్టులకు ఇళ్ళ స్ధలాలు,డబుల్ బెడ్ రూం ఇళ్ళు దక్కాయన్నారు.2018 వరకు జర్నలిస్ట్ హెల్త్ కార్డులు అద్బుతంగా పనిచేశాయని,ఆ తరువాత నుంచి కార్పోరేట్ ఆసుపత్రులు పట్టించుకోవడం లేదని అయితే త్వరలో ప్రభుత్వ ఉద్యోగులతోపాటు జర్నలిస్టులకు మెరుగైన నూతన హెల్త్ కార్డు విధానంను తీసుకరాబోతున్నారని ఈవిషయాన్ని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తమ యూనియన్ ప్రతినిధి బ్రంధానికి హామి ఇచ్చారన్నారు.ఎన్నికల నోటిఫికేషన్ ముందే ఈ కొత్త స్కింను ప్రకటించే అవకాశం ఉందన్నారు. జర్నలిస్టుల కుటుంబాలకు హైల్త్ స్క్రినింగ్ క్యాంపులు ప్రభుత్వం నిర్వహించబోతుందన్నారు. అదేవిధంగా జర్నలిస్టుల పిల్లలకు ప్రయివేట్ విద్యా సంస్ధలో ఫీజు రాయితీ కోసం డి ఇ వోలతో సర్కులర్ ను జారీ చేయించడం కంటే ప్రభుత్వం నుంచి జి వో జారీ చేయించేందుకు ప్రభుత్వం పై వత్తిడి పెంచుతామన్నారు.
ఇది కూడా చదవండి: రేపే తుమ్మల జాయినింగ్