Telugu News

నేలకొండపల్లి రామదాసుని మందిరంలో రామభక్తుని ఛాయ

నేలకొండపల్లి-విజయంన్యూస్

0

నేలకొండపల్లి రామదాసుని మందిరంలో రామభక్తుని ఛాయ

హనుమంతుడే సాక్షాత్కరించినట్లున్న నేలకొండపల్లి రామదాసు మందిరంలో దృశ్యం… 

(నేలకొండపల్లి-విజయంన్యూస్) 

అది రామదాసుని నిలయం.. రామభక్తుడిగా అవతారమెత్తిన గోపన్న మందిరం.. ఆ నిలయంలో రామదాసు ఉత్సవాలు జరుగుతున్నాయి.. నిత్యం పూజ చేసే కార్యక్రమంలో భాగంగా రామమందిరంకు వచ్చిన పూజారికి ఒక వింత కనిపించింది.. దానిని మరోసారి నిశితంగా పరిశీలించాడు.. ఆశ్ఛర్యపోయాడు.. చేతులేత్తి దండం పెట్టి పూజలు చేశాడు.. పూజారి పూజలుచేయడమేంటి.. ఆశ్ఛర్యపోవడమేంటి అని అనుకుంటున్నారా..? ఇది నిజమే.. అక్షరాల నిజం.. ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి  మండలంలోని రామదాసు మందిరంలో శుక్రవారం జరిగిన వింత అది. రామదాసు ఉత్సవాల సందర్భంగా పూజారి రామదాసు మందిరంలో పూజలు చేస్తున్నాడు.

also read :-హసన్ పర్తి-కరీంనగర్ రైల్వే లైన్ ను తక్షణమే మంజూరు చేయండి : బండిసంజయ్

ఈ క్రమంలో ఓ మూలన ఒక వింత కనిపించింది. దీంతో ఏంటని పరిశీలించిన ఆయన మరోసారి విచిత్రంగా చూశాడు. అక్కడ ఆంజనేయస్వామి రూపంలో ప్రతిరూపం కనిపించింది. దీంతో పూజారి, భక్తులను పిలిచాడు. ఆ చాయచిత్రాన్ని చూపించగా భక్తులు ఆశ్ఛర్యపోయారు. రామదాసు మందిరంలో ఉన్న కిటికి వారగా నీరు లీకై తడి ఏర్పడింది. ఆ తడి ప్రాంతంలో హనుమంతుడి ప్రతిరూపం ఏర్పడటంతో పూజారితో పాటు భక్తులు ఆశ్ఛర్యపోయారు. రామదాసు మందిరంలో పూజలు చేయడమే కాకుండా హానుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఆ చిత్రం ఎక్కువ సేపు లేదని, అందుకే భక్తులందరికి కనిపించలేదని అన్నాడు. ఆ పూజారి మాత్రం తన సెల్ పోన్ లో ఆ చిత్రాన్ని బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. హనుమంతుడి చాయచిత్రం చూసినందుకు చాలా సంతోషంగా ఉందని, ఆయన రూపం చూసినట్లే ఉందన్నాడు పూజారి.