ఎమ్మెల్యే పీఏలా..? ప్రభుత్వాధికారులా..?
కొత్త పించన్ల లిస్ట్ సర్పంచ్ లకు కాకుండా టీఆర్ఎస్ నేతలకు ఇస్తారా..?
ఎమ్మెల్యే పీఏలా..? ప్రభుత్వాధికారులా..?
★★ కొత్త పించన్ల లిస్ట్ సర్పంచ్ లకు కాకుండా టీఆర్ఎస్ నేతలకు ఇస్తారా..?
★★ నేలకొండపల్లి ఎంపీడీవోను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ సర్పంచ్ ల ఆధ్వర్యంలో ధర్నా
(నేలకొండపల్లి/కూసుమంచి-విజయంన్యూస్)
నేలకొండపల్లి మండలం లో ఎంపీడీఓ అధికారి అధికార పార్టీ కీ అనుకూలంగా పనిచేస్తున్నాడని ఆయన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఎంపీడీఓ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
Allso read:- మాకోద్దు ఈ అన్నం అంటూ విద్యార్థుల ఆందోళన
అర్హులు అయినా పెన్షన్ దారులు కాదని తెరాస పార్టీ చెప్పిన వారికీ ఇవ్వటం, అధికారులు, సర్పంచ్ ల కంటే ముందే తెరాస కార్యకర్తలకు ఫించన్ ల లిస్ట్ వాళ్ళ చేతికి ఎలా వెళ్ళిందని ఎంపీడీఓ ను నిలాదీశారు. ఈ సంధర్భంగా చెరువు మాదారం సర్పంచ్ మాట్లాడుతూ మేము బంగారం తాకట్టు పెట్టి గ్రామ అభివృద్ధికీ పనిచేసామని, అధికారులు చెప్పిన పనులు గొర్రెల్ల చేశామని కానీ అధికారులు తెరాస పార్టీ శ్రేణులు కు అనుకూలంగా పనిచేస్తున్నారు అని ఆరోపించారు. మండలం అధికార కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తు ఎంపీడీఓ ను సస్పెండ్ చేయాలి అని సర్పంచ్ నవీన్, మాజీ సర్పంచ్ మామిడి వెంకన్న, ఎంపీటీసీ బొందయ్య, కల్పన, మండల కాంగ్రెస్ నాయకులు హుస్సేన్, నేలకొండపల్లి వార్డు మెంబెర్స్, చెరువు మాదారం సర్పంచ్ పాల్గొని డిమాండ్ చేశారు. పంచాయతీ లలో సర్పంచ్ లకు విలువలేనప్పుడు ఎన్నికలు నిర్వహించడం ఎందుకని, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళనే సర్పంచ్ లుగా పెట్టుకుంటే అయిపోతుంది కదా..? అని విమ్మర్శించారు.
Allso read:- ‘గాడ్‌ఫాదర్’మ్యూజిక్ పై నెటిజన్ల ఫైర్