ఇంటింటికి జాతీయజెండాలను పంపిణి చేసిన కందాళ ఉపేందర్ రెడ్డి
ప్రతి ఒక్కరు జెండా పండుగను ఘనంగా నిర్వహించుకోవాలన్న ఎమ్మెల్యే
ఇంటింటికి జాతీయజెండాలను పంపిణి చేసిన కందాళ ఉపేందర్ రెడ్డి
== ప్రతి ఒక్కరు జెండా పండుగను ఘనంగా నిర్వహించుకోవాలన్న ఎమ్మెల్యే
నేలకొండపల్లి/కూసుమంచి, ఆగస్టు 11(విజయంన్యూస్)
ప్రతి ఒక్కరు జాతీయభావం కల్గి ఉండాలని, 75వ స్వాతంత్ర వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నేలకొండపల్లి మండల కేంద్రంలో ఇంటింటికి జెండాను పంపిణి చేశారు. 75వ స్వతంత్రదినోత్సవంను పురష్కరించుకుని సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఇంటింటికి తీరంగ్ జెండా కార్యక్రమంలో భాగంగా నేలకొండపల్లి మండల కేంద్రంలో ప్రజలందరికి మూడురంగుల జెండాను పంపిణి కార్యక్రమంను టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా, ముఖ్యఅతిథిగా పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి హాజరైయ్యారు.
allso read- కూసుమంచిలో ఫ్రీడం రన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కందాళ
వందలాధి మంది ప్రజలకు జాతీయ జెండాలను పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర భారత వజ్రోత్సవాలను అడుగడుగునా దేశభక్తి భావన,స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో మేల్కొలిపే విధంగా సమున్నత స్థాయిలో,అంగరంగ వైభవంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ద్వీసప్తాహం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి జాతీయ జెండాలను పంపిణీ చేసి,జెండా ప్రాముఖ్యతను వివరించారు. జాతీయ జెండాను ఆగస్టు 15న ఇంటిపై ఎగరేయాలని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, ఉన్నంబ్రహ్మయ్య, ఎంపీపీ తదితరులు హాజరైయ్యరు.