Telugu News

నేలకొండపల్లి మండలంలో మహిళపై బీఆర్ఎస్ నేత దాడి

జుట్టుపట్టుకుని నేలకొసికొట్టిన సోసైటీ చైర్మన్

0

నేలకొండపల్లి మండలంలో మహిళపై బీఆర్ఎస్ నేత దాడి

== జుట్టుపట్టుకుని నేలకొసికొట్టిన సోసైటీ చైర్మన్

== పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన మహిళ..దర్యాప్తు చేస్తున్న పోలీసులు

(నేలకొండపల్లి-విజయంన్యూస్)

బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ నేత.. ఆయన ఒక ప్రజాప్రతినిధి.. అలాంటి నేత దుశ్శాసన పర్వం బయటపడింది.. ఓ మహిళపై ఆ నేత జట్టు పట్టుకుని నేలకొట్టి దాడి చేసిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది… దీంతో ఆ మహిళ అక్కడే సృహతప్పిపడిపోయింది.. ఇది చూసిన కుటుంబ సభ్యులు బయటకు వెళ్లినప్పటికి బడా నాయకుడు కావడంతో కుటుంబ సభ్యులు వెనకడుగు వేశారు.. పోలీసులను సంప్రదించారు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..?

allso read- నాని మరో కొత్త సినిమా

నేలకొండపల్లి మండలంలోని కోనాయిగూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నేత, సోసైటీ చైర్మన్ గా పనిచేస్తున్న సైదిరెడ్డి ఓ భూవివాదం విషయంలో మంగళవారం సాయంత్రం గొడవ జరిగింది. ఈ క్రమంలో సైదిరెడ్డికి, కొమ్మినేని పుష్పావతికి మధ్య పరస్పర వాగ్వాదం జరిగింది. కాగా అక్కడే ఉన్న సైదిరెడ్డి ఓ వ్యక్తిని కొడుతుండగా పుష్పావతి అడ్డుపోయి అపే ప్రయత్నం

చేసింది. దీంతో రెచ్చిపోయిన ఆ నాయకుడు ఆమె జుట్టుపట్టుకుని నేలకేసి రోడ్డుపై కొట్టడంతో ఆ మహిళ అక్కడిక్కడే సృహతప్పిపడిపోయింది.. తక్షణమే కుటుంబ సభ్యులు మొత్తుకుంటూ అక్కడికి వెళ్లిపోయి వారించే ప్రయత్నం చేయగా కుటుంబ సభ్యులపై దాడి చేశారు. కాగా కొద్ది సమయం తరువాత బాధిత మహిళ పుష్పావతిని ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్లగా, చికిత్స పొందుతుంది. కుటుంబ సభ్యులు నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు మేరకు ఎస్ఐ స్రవంతి రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై ఎస్ఐ స్రవంతిని విజయం పత్రిక వివరణ మహిళ కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేశారని, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

అయితే ఈ సంఘటనపై పలువురు ప్రజాసంఘాల నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. పాలేరు నియోజకవర్గంలోని అధికార పార్టీకి చెందిన నాయకులు రెచ్చిపోతున్నారని, ఇష్టానుసారంగా బెదిరింపులకు పాల్పడటం, అడ్డం వస్తే దాడులు చేయడం లాంటి సంఘటనలకు పాల్పడుతున్నరని, ఇలాంటి సంఘటనలపై పోలీసులు నిమ్మకుంటే భవిష్యత్ లో మరింత ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజా సంఘాల నాయకులు మండిపడుతున్నారు.

allso raed- బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన నర్సయ్యగౌడ్