Telugu News

నేలకొండపల్లి ఎస్ఐ కు కుల అహంకారం ఉంది: మంద కృష్ణ మాదిగ

దళిత హక్కులను పరిరక్షించాల్సిన ఎస్సై అనేక సార్లు అవమానించారు

0

నేలకొండపల్లి ఎస్ఐ కు కుల అహంకారం ఉంది: మంద కృష్ణ మాదిగ

== దళిత హక్కులను పరిరక్షించాల్సిన ఎస్సై అనేక సార్లు అవమానించారు

=== మా ప్రతినిధులు స్టేషన్ కు వెళ్లినప్పుడు కులప్రవర్తతో మాట్లాడారు

== శివాలయం వద్ద డీజే ఆపడం తప్పు కదా..?

== దళితులు దైవ కార్యక్రమాలను అడ్డుకోవడం తప్పే

== ఎస్సై పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి కేసు తప్పక పెట్టాలసిందే…

== పెట్టకపోతే దశలవారిగా ఆందోళన చేస్తాం

== ఎమ్మెల్యే కు కులతత్వం ఎక్కువే

== ఎస్సై, ఏసీపీ, ఎమ్మెల్యే ముగ్గురూ రెడ్డి కులస్థులే

== విలేకర్ల సమావేశంలో ఆగ్రహించిన ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ

(నేలకొండపల్లి-విజయంన్యూస్)

నేలకొండపల్లి ఎస్ఐ స్రవంతిరెడ్డికి కుల అహంకార్ని ప్రదర్శిస్తుందని, ఆమె దళితకులాల పట్ల, దళితుల పట్ల చిన్న చూపుగా వ్యవహరిస్తుంటారని, మాట్లాడే ప్రవర్తన కూడా తేడా ఉంటుందని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. నేలకొండపల్లి మండలంలో బుధవారం పర్యటించిన ఆయన ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. దళిత హక్కులను పరిరక్షించాల్సిన ఎస్సై అనేక సార్లు అవమానించారని ఆరోపించారు.

allso read- ‘ఇంజక్షన్’ హత్య లో పెద్ద ట్విస్ట్

మా ప్రతినిధులు పలు కేసులలో మాప్రతినిధులు స్టేషన్ కు వెళ్ళినప్పుడు కులాల ప్రస్తావన చేశారని ఆరోపించారు. దళితులు గణేష్ నిమజ్జనం  చేస్తుంటే డీజేకి అనుమతులు లేవంటూ అడ్డు పడి శివాలయం వద్ద డీజే ఆపడం ఆమెకు తప్పు కదా..? అని ప్రశ్నించారు. గణేష్ నిమజ్జనం అంటేనే డీజేలతో సంబరాలు చేసుకుంటూ నిమజ్జనం చేస్తారని, ఇది దేశవ్యాప్తంగా కొనసాగుతుందన్నారు. నేలకొండపల్లి మండలంలో అనేక మంది డీజేలు పెడితే మాట్లాడని ఎస్ఐ స్రవంతి రెడ్డి ఒక దళితులు డీజే పెట్టి దైవ పూజలు చేస్తేనే తప్పు వచ్చిందా.?అంటూ ప్రశ్నించారు.  దళితులు దైవ కార్యక్రమాలను అడ్డుకోవడం ఎంత వరకు సమజసం అని అన్నారు. డీజేను అడ్డుకోవడమే కాకుండా మాదిగ నాకోడకల్లారా..అంటూ బెదిరిస్తూ మీదమీదకు వెళ్తూ దళితులను అవమానించడం ఎస్ఐ ప్రవర్తన సరైందేనా..? అంటూ ప్రశ్నించారు. ఆమె అన్నది పూర్తిగా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందని, కోట్లాది మంది ఆ వీడియోలను చూశారు, విన్నారని అన్నారు. కులం పేరు పెట్టి దూషించటమే కాదు, మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడినా చట్టం ప్రకారం నేరమేనని, స్రవంతిరెడ్డి కి మా దళితులు కొడుకులెలా అయ్యారాని ఆరోపించారు.  దళితులని తెలిసి తిట్టడం మాకు అవమానం కదా.? అని ప్రశ్నించారు. ఎస్సై స్రవంతిరెడ్డి పై  తప్పకుండా కేసు పెట్టాలసిందేనని అన్నారు. మా హక్కులను పరిరక్షించాల్సిన వారే మాపై కేసులు నమోదు చేస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో కూడా ఎస్ఐ స్రవంతిరెడ్డి దళితుల పట్ల అవమానంగా మాట్లాడారని, ఆ సమయంలో గట్టిగ మాట్లాడితే ఎస్ఐ క్షమాపణలు చెప్పారని, అయినప్పటికి ఆమెలో మార్పు రాలేదని ప్రశ్నించారు. చట్టాన్ని అమలు జరగకుండా అడ్డుకుంటే సిఐ, ఏసీపీ కూడా బాధ్యులె అవుతారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం పోలీసులు దోషులు అవుతారని అన్నారు. మా పోరాటాన్ని దశల వారిగా పోరాడుతామని తెలిపారు. ఎస్ఐ, సీఐ లను ఎమ్మెల్యే కాపాడుతున్నారు.. ఆయన పై దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

allso read- భద్రాద్రి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

== ఎస్సై, ఏసీపీ, ఎమ్మెల్యే ముగ్గురూ రెడ్డి కులస్థులే

పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి కులపిచ్చి ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుందని, గతంలో కూడా దళిత ఎస్ఐ పనిచేస్తే అతన్ని ట్రాన్సఫర్ చేసి రెడ్డి ఎస్ఐ ని వేయించుకున్నాడని గుర్తు చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే, ఏసీపీ, ఎస్సైఐ లు ముగ్గురు రెడ్డి కులస్తులేనని అన్నారు.  గతంలో ఓ దళిత ఎస్సైను అకారణంగా ఇక్కడి నుంచి పంపారని గుర్తు చేశారు.  ఎమ్మెల్యే వచ్చే ఎన్నికలలో రాజకీయ మూల్యం చెల్లించక తప్పదన్నారు.  దళిత యువకుల మీద కేసు నమోదు చేస్తే కచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరింయారు.  మాపై దాడిని ఖండించాలసింది పోయి, అదే ఏసీపీ మా యువకుల మీద కేసులు పెట్టించడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్ని కేసులు పెడతారో చూస్తామని, మాకు సమయం వచ్చినప్పుడు ఏం జరుగుతుందో.? మీకే తెలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పగిడికత్తుల ఈదయ్యమాదిగ తదితరులు హాజరైయ్యారు.

allso read- తక్షణ సాయం నా నైజం… పొంగులేటి