పార్లమెంటు నూతన భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలి:ఎంపీ రవిచంద్ర
సచివాలయానికి మహనీయులు అంబేడ్కర్ పేరు పెట్టిన కేసీఆర్ మహానేత
పార్లమెంటు నూతన భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలి:ఎంపీ రవిచంద్ర
== నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలు, యావత్ తెలంగాణ బిడ్డలకు శుభాకాంక్షలు
== సచివాలయానికి మహనీయులు అంబేడ్కర్ పేరు పెట్టిన కేసీఆర్ మహానేత
== అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ ప్రజల కల సాకారమైంది
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
కొత్తగా కట్టిన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర రాష్ట్ర ప్రజలు,దేశ విదేశాలలో నివసిస్తున్న తెలంగాణ బిడ్డలందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.హైదరాబాద్ నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం మరింత ఇనుమడించేలా,రాజసం ఉట్టిపడే విధంగా అద్భుతంగా నిర్మాణమైన సచివాలయం మనకెంతో గర్వ కారణమన్నారు.
ఇది కూడా చదవండి: ప్రతిపక్షాలు ఆరోపణలకు అర్థం లేదు :రవిచంద్ర
చరిత్ర పుటల్లో నిక్షిప్తమయ్యే ఈ దివ్య భవనానికి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టడం,ఈ మహాసౌధం ప్రారంభోత్సవ వేళ మనందరికి శుభదినం అన్నారు.అంబేడ్కర్ మహాశయుడు రాజ్యాంగంలో పొందుపర్చిన ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మహానేత కేసీఆర్ నాయకత్వాన సాకారమైందని రవిచంద్ర తన సందేశంలో పేర్కొన్నారు.అంబేడ్కర్ విగ్రహాలలో ప్రపంచంలో కెల్లా అతి పెద్ద దానిని ఇటీవల ఆవిష్కరించుకోవడాన్ని,ఎస్సీల సముద్ధరణకు దళితబంధు, అంబేడ్కర్ విద్యానిధి (ఓవర్సీస్ స్కాలర్ షిప్)పథకాలను అమలు చేస్తుండడాన్ని గుర్తు చేశారు.అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకుపోతూ కేసీఆర్ తాను సాధించిపెట్టిన రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తూ,ప్రజలందరి సంక్షేమానికి అంకితభావంతో కృషి చేస్తున్నారన్నారు.పార్లమెంట్ నూతన భవనానికి రాజ్యాంగ నిర్మాత పేరు పెట్టడం సముచితంగా ఉంటుందని,ప్రధాని మోడీ వెంటనే సానుకూలంగా స్పందించి ఆ భవనానికి అంబేడ్కర్ పేరు ఖరారు చేయాలని ఎంపీ వద్దిరాజు డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: క్రీడాలను ప్రోత్సంహించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ: మంత్రి శ్రీనివాస్ గౌడ్