Telugu News

బుద్ధ వనం లో కొత్త రాతియుగపు ఆనవాళ్లు…. @ నాగార్జునసాగర్

నాగార్జునసాగర్ లో మళ్ళీ వెలుగుచూసిన శిలా యుగపు అవశేషాలు

0

బుద్ధ వనం లో కొత్త రాతియుగపు ఆనవాళ్లు….
నాగార్జునసాగర్ లో మళ్ళీ వెలుగుచూసిన శిలా యుగపు అవశేషాలు

 

( నాగార్జునసాగర్ – విజయం న్యూస్)

ఆదిమానవుని అడుగుజాడలకు నెలవైన తెలంగాణలోని నాగార్జునసాగర్ పరిసరాలలో రాతియుగపు ఆనవాళ్లు మరోసారి బయటపడ్డాయని పురావస్తు పరిశోధకులు, బుద్ధవనం బౌద్ధ నిపుణులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.

తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ నాగార్జునసాగర్ లో అభివృద్ధి పరచిన బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో బుద్ధవనం పరిసరాలలో వాకింగ్ ట్రాక్ను పరిశీలిస్తుండగా కృష్ణాతీరంలో నాలుగు చోట్ల, మధ్య రాతియుగపు సూక్ష్మ రాతి పనిముట్లు, కొత్త రాతియుగపు గొడ్డళ్లు , సాన దీసిన గుంటలు, ఒడిష రాళ్లు అరగదీసిన ఆనవాళ్లు వెలుగు చూశానని శివనాగిరెడ్డి తెలిపారు.

గతంలో నాగార్జున కొండ పరిసరాలలో రాతియుగపు ఆనవాళ్ల బయల్పడిన యని ఈ కొత్త ఆనవాళ్లు ఈ ప్రాంతం ఆదిమానవులు కార్య స్థావరంగా ఉండేదని నదితీరాన దగ్గరగా వేటకు వెళ్లి ఆహార సంపాదన కు అనువుగా ఉండేదని ఆయన తెలిపారు.

కొత్త రాతియుగపు ఆనవాళ్లు ఉన్న వాకింగ్ ట్రాక్ కు పైన ఆర్కలాజికల్ టూరిజాన్ని కూడా అభివృద్ధి చేయవచ్చునని బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో బుద్ధవనం ఓ ఎస్ డి సుధన్ రెడ్డి, బుద్ధవనం SE క్రాంతి బాబు, బుద్ధవనం డిజైన్ ఇన్చార్జి శ్యామ్ సుందర్ రావు మరియు నరసింహారావు పాల్గొన్నారు.

 

also read :- * స్కీమ్లు * ఏడాది ఇచ్చి చేతులు దులుపుకున్న – తెలంగాణ ప్రభుత్వం