Telugu News

న్యూ ఇయర్ కు ఆర్టీసీ బంఫర్ ఆపర్

== పండెండేళ్ల లోపు చిన్నారులకు హైదరాబాద్ లో ప్రీ ప్రయాణం

0

న్యూ ఇయర్ కు ఆర్టీసీ బంఫర్ ఆపర్
== పండెండేళ్ల లోపు చిన్నారులకు హైదరాబాద్ లో ప్రీ ప్రయాణం
== రూ.100 కే ఆ కేంద్రాలకు బస్ ప్రయాణం
== రూ.4వేలకే స్పెషల్ ప్యాకేజీలు
== ప్రకటించిన ఆర్టీసీ ఎండీ సజ్జనర్
(హైదరాబాద్-విజయంన్యూస్)
ఆర్టీసీ ఎండీ గా సజ్జనర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆర్టీసీ సంస్థలో నూతన ఒరవడి కనిపిస్తోంది.. అద్భుతమైన పథకాలను ప్రకటిస్తూ నిత్యం ఆర్టీసీ సంస్థను ప్రజల్లో నిలబెట్టే విషయంలో సజ్జనర్ సూపర్ సక్సెస్ సాధిస్తున్నాడనే చెప్పాలి.. పండుగలకు, విద్యార్థుల కోసం అనేక పథకాలను ప్రవేశ పెట్టి అందర్ని ఆశ్ఛర్యంలోకి తీసుకెళ్తున్న ఆర్టీసీ ఎండీ నూతన సంవత్సరం సందర్భంగా మరో నూతన పథకానికి శ్రీకారం చుట్టారు. ఆర్టీసీ చరిత్రలో కనివిని ఎరుగని పథకాలను ప్రకటిస్తూ ప్రయాణికులను ఉత్తేజ పరుస్తున్నారు. ప్రస్తుతం నూతన సంవత్సరం సందర్భంగా కొత్త పథకాన్ని ప్రకటించారు. హైదరాబాద్ శివార్లలో న్యూఇయర్ జరిగే ప్రాంతాలకు ప్రయాణికులు వెళ్లే వారికి ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. అర్థరాత్రి 2గంటల వరకు బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. అంతే కాదు.. అందరికి ఒకే రకమైన ఒక ధర ను ప్రకటించారు. ఒక్కోక్కరికి రూ.100 చొప్పున చెల్లిస్తే చాలు రాకపోకలు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ లోని 15 ప్రాంతాలను ఎంపిక చేసినట్లు సజ్జనర్ తెలిపారు. న్యూ ఇయర్ ఈవెంట్స్ కు వెళ్లే వారి కోసం 31న రాత్రి 7.30గంటలకు, 9.30గంటలకు తిరుగు ప్రయాణం కోసం అర్థరాత్రి 12.30గంటలకు, తెల్లవారుజామున 3గంటలకు బస్సు సర్వీసులను నడపనున్నట్లు తెలిపారు. అలేగ ఈవెంట్స్ కోసం ఎవరైన ప్రత్యేకంగా బస్ సౌకర్యం కావాల్సిన వారికి 18 సీట్ల ఏసీ బస్సులను వెళ్లి రావడానికి ప్యాకేజీకి ఇస్తామని తెలిపారు. అంతే కాదు కేవలం రూ.4వేలు చెల్లిస్తే చాలని ప్రకటించి అందర్ని ఆశ్ఛర్యపరిచారు.
== 12ఏళ్లలోపు చిన్నారులకు బంఫర్ ఆపర్..
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆర్టీసీ ఎండీ పిల్లలకు బంఫర్ ఆపర్ ఇచ్చారు. 12 ఏళ్లలోపు పిల్లలు నూతన సంవత్సర వేడుకలకు హాజరైయ్యేందుకు ఉచితంగా బస్సు సర్వీస్ చేయోచ్చని ప్రకటించి సంచలనం రేపారు. ఆయా వయస్సు లోపల గల పిల్లలు జనవరి 1న ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించోచ్చని సంస్థ ఎండీ సజ్జనర్ ప్రకటించారు. దీంతో ఆర్టీసీ ప్రయాణికులు ఆర్టీసీ ఎండీ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. విశ్లేషకులు కూడా అశ్ఛర్యపోతున్నారు. చూద్దాం.. సజ్జనర్ నూతన సంవత్సరం సందర్భంగా ఆర్టీసీ బస్సుల ప్రయాణం ఎంత వరకు సక్సెస్ అవుతుందో..? యువకులందరు మద్యంతాగి బండి పై నడిచేదానికంటే.. బస్సుల్లో ప్రయాణిస్తే సెప్ జర్ని.. డ్రంక్ అండ్ అండ్ డ్రైవ్ సమస్య ఉండదు..? చూడండి మరి..? సజ్జనరా మజాకా..?

also read :-సీయం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం..