Telugu News

తెలంగాణలో రాబోయేది బిజెపి సర్కారే*

వైరాలో పర్యటించిన బీజేపీ నేత పొంగులేటి

0

తెలంగాణలో రాబోయేది బిజెపి సర్కారే*

** దొంగ మాటలు చెప్పే కెసిఆర్ ని, ఉత్త హామీలిచ్చే కాంగ్రెస్ ను నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు*

** వైరాలో పర్యటించిన బీజేపీ నేత పొంగులేటి

(వైరా టౌన్-విజయం న్యూస్):

క్షేత్రస్థాయిలో బూత్ కమిటీలను మరింత పటిష్టం చేయాలని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, తమిళనాడు రాష్ట్ర సహా ఇంఛార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి:- జమిలి ఎన్నికలు లేనట్లే..?

ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం నుండి మహాత్మా గాంధీ జయంతి వరకు నిర్వహించే *సేవా పక్వాడ* , *బూత్ స్వశక్తీకరన్* కార్యక్రమాల్లో భాగంగా టౌన్ పరిధిలోని 210,211, 212 పోలింగ్ బూత్ కమిటీలను జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, జిల్లా ఇంచార్జ్ కలవలపు త్రిలోకేశ్వర్, రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి లతో పరిశీలించారు, బూత్ కమిటీలను మరింత పటిష్టం చేయాలని ఆయన సమక్షంలోనే బూతు కమిటీలను పూర్తి చేసి, వాట్సాప్ గ్రూపులను రూపొందించారు. బూత్ అధ్యక్షులు ఇన్చార్జిలను, కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులు కూరపాటి కోటమ్మ, ముదిగొండ విజయలక్ష్మి, ఎస్ కే షాహిన్ లను సన్మానించారు.

ఇది కూడా చదవండి:- వైరా బిజెపి అభ్యర్థత్వానికి బీపీ నాయక్ దరఖాస్తు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దుష్ట అవినీతి పరిపాలన కొనసాగుతుందని, కెసిఆర్ బూటకపు మాటలు విని మరొక్కసారి మోసపోవద్దని, ప్రపంచంలో అగ్రగ్రామిగా భారతదేశాన్ని నిలుపుతున్న నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వాన్ని తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైరా అసెంబ్లీ కన్వీనర్ నెల్లూరి కోటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శిలు నున్న రవికుమార్, శ్యామ్,బిజెపి నాయకులు బీపీ నాయక్, కృష్ణ,ఏలే భద్రయ్య, కొవ్వురి నాగేశ్వరరావు, కోసూరి గోపాలకృష్ణ, నరేష్, రామారావు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.