Telugu News

నిత్య కృషీవలుడు ఎంపీ నామ నాగేశ్వరరావు

నామ అంటే పేదలకు ఓ భరోసా

0
నిత్య కృషీవలుడు ఎంపీ నామ నాగేశ్వరరావు
🔶నామ అంటే పేదలకు ఓ భరోసా
🔶నేనున్నాంటూ అభాగ్యులకు బాసట..ఆసరా
🔶రానున్న ఎన్నికల్లో కేసీఆర్ ను, నామను మంచి మెజార్టీతో గెలిపించుకోవాలి 
🔶 మళ్ళీ కేసీఆరే  సీఎం
🔶 ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రత్యేక  చొరవతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 68 మందికి మంజూరైన రూ.31,58,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు
ఖమ్మం, ఏప్రిల్ 06(విజయం న్యూస్): 
నిత్య కృషీవలుడు, నిజమైన ప్రజా సేవకుడు ఎంపీ నామ నాగేశ్వరరావు అని రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. నామ నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో ఖమ్మం, అశ్వా రావుపేట, కొత్తగూడెం, మధిర, పాలేరు, సత్తుపల్లి, వైరా, భద్రాచలం, వరంగల్ కు  చెందిన 68 మంది లబ్దిదారులకు మంజూరైన రూ.31,58,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను గురువారం ఖమ్మంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో నల్లమల స్థానిక ప్రజా ప్రతినిధులతో కలసి, లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నల్లమల మాట్లాడుతూ నామ అంటేనే పేద ప్రజలకు ఓ భరోసా అన్నారు. కష్టాల్లో ఉన్న పేదలకు సాయం చేయడం నామకు భగవంతుడు ఇచ్చిన వరమన్నారు. నిత్యం పేద, బడుగు, బలహీన వర్గాల కోసం తహతహలాడే నామ ఎంపీగా లభించడం జిల్లా ప్రజల అదృష్టమని అన్నారు. పేదలకు ఏ కష్టమొచ్చినా నేనున్నంటూ వారికి బాసటగా ఉంటూ రాజకీయాలకతీతంగా సేవలందిస్తున్నారని అన్నారు.
ఇదికూడా చదవండి: బండి సంజయ్ విడుదల
నామ ముత్తయ్య ట్రస్ట్ ద్వారా గ్రామ గ్రామానికి వాహనాలు పంపి, మంచినీళ్లు పంపి, ప్రజల దాహాన్ని తీర్చిన ఘనత ఒక్క నామకే దక్కుతుందన్నారు. సీఎం కేసీఆర్ తో ప్రత్యేకించి  మాట్లాడి, పార్టీలకతీతంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆపదలో ఉన్న వారికి సాయం అందిస్తున్న నామను గుర్తు పెట్టుకుని, రానున్న ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. నామను, కేసీఆర్ ను మంచి మెజార్టీతో  గెలిపించుకుంటేనే రానున్న కాలంలో మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుందన్నారు. కేవలం 8 ఏళ్ల కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా  చేసిన కేసీఆర్  మళ్ళీ మూడోసారి సీఎం ఖావడం ఖాయమన్నారు. రానున్న కాలంలో తెలంగాణ ఖ్యాతి ప్రపంచం నలుమూలలా విస్తరిస్తుందని నల్లమల పేర్కొన్నారు. జిల్లా టెలికాం సలహా మండలి(టీఏసీ) సభ్యులు చిత్తారు సింహాద్రి యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కొణిజర్ల మండల నాయకులు  పోట్ల శ్రీను, కొణిజర్ల మండలం గోపవరం సొసైటీ ఛైర్మన్ చెరుకుమల్లి రవి, చింతకాని మాజీ ఎంపిపి నారపోగు
వెంకటేశ్వరరావు,దిశ కమిటీ సభ్యులు చింతలచెర్వు లక్ష్మీ, గుగులోత్ కృష్ణ, బోనకల్ మండలం రావినూతల సర్పంచ్ ఉపేందర్, బోనకల్ మండల కార్మిక విభాగం అధ్యక్షులు బంధం నాగేశ్వరరావు, గుండ్రాతి మడుగు గ్రామ శాఖ అధ్యక్షులు భాగం వెంకటేశ్వరరావు, ఎంపీ క్యాంప్ ఇన్చార్జి కనకమేడల సత్యనారాయణ, పార్టీ నాయకులు గొడ్డేటి మాధవరావు, వాకదాని కోటేశ్వరరావు, మధిర నియోజకవర్గ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి తాళ్లూరి హరీష్, నామ సేవా సమితి నాయకులు పాల్వంచ రాజేశ్, చీకటి రాంబాబు, రేగళ్ల కృష్ణ ప్రసాద్, బొర్రా నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.