Telugu News

నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి పాత నేరస్తుడు పరారీ

నిజామాబాద్ స్టాఫ్ రిపోర్టర్ - విజయం న్యూస్)

0

నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి పాత నేరస్తుడు పరారీ

(నిజామాబాద్ స్టాఫ్ రిపోర్టర్ – విజయం న్యూస్):-

పోలీసులు తనిఖీల్లో భాగంగా పట్టుబడిన పాత నేరస్థుడు ఒకరు నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి తప్పించుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సోమవారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని బస్టాండ్ ప్రాంతంలో సోమవారం రాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా నవీపేట్ ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు ఒకే బైక్ పై వెళ్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

also read :-నూతన వధూవరులను ఆశీర్వదించిన

ఆ సమయంలో పాత నేరస్థుడైన ఒక యువకుడి వద్ద కత్తి ఉండడంతో స్టేషన్ కు తరలించారు. పోలీసులు ఏమరు పాటుగా ఉండడంతో కత్తి ఉన్న యువకుడు అక్కడి నుంచి పరారీ అయ్యాడు. పరారీలో ఉన్న యువకుడి కోసం గాలిస్తున్నారు. పరారైన యువకుడి పై బైక్ చోరీ కేసులు ఉండగా ఇటీవలే జైలు నుంచి విడుదల అయినట్లు సమాచారం. కాగా పోలీసులు అదుపులో గంగాధర్, గణేష్ అనే వ్యక్తులు ఉండగా, సలీం అనే పాత నేరస్థుడు పరారైయ్యాడని తెలుస్తోంది. ఈ విషయంలో పోలీసులు స్పందించాల్సిన అవసరం ఉంది.