Telugu News

కలికాలం బాబాయ్.. బైక్ పైననే అన్ని కానీ చేస్తున్నావ్ లవర్స్! మరో అర్జున్ రెడ్డి..!!

కర్ణాటక విజయం న్యూస్

0

కలికాలం బాబాయ్.. బైక్ పైననే అన్ని కానీ చేస్తున్నావ్ లవర్స్! మరో అర్జున్ రెడ్డి..!!

(కర్ణాటక విజయం న్యూస్):-

టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది.. మనుషులు కూడా దారుణంగా తయారవుతున్నారు. హడ్డుహాదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఒకప్పుడు రహస్యంగా ప్రేమించుకునే ప్రేమికులు.. ఇప్పుడు బహిరంగంగానే తిరుగుతున్నారు. కొన్ని ప్రేమ జంటలు అయితే దారుణంగా రెచ్చిపోతున్నాయి. నడిరోడ్డు మీద ఉన్నామా, పబ్లిక్‌లో ఉన్నామా అని కూడా ఆలోచించకుండా రొమాన్స్‌లో మునిగిపోతున్నారు. వారు చేసే పనులకు సభ్య సమాజం తలదించుకుంటుంది. ఇలాంటి సంఘటనే తాజాగా కర్ణాటకలో చోటుచేసుకుంది.

also read :-చౌటపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులపై ప్రధానోపాధ్యాయుడి దాడి
కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట మున్సిపాలిటీ పరిసర ప్రాంతంలో ఓ ఇద్దరు ప్రేమికులు రోడ్డుపైనే ఆదమరిచి ప్రవర్తించారు. ప్రియుడు బైక్ నడుపుతుండగా.. ప్రేయసి పెట్రోల్ ట్యాంక్‌పై అతడికి ఎదురుగా కూర్చుని రొమాన్స్ చేసింది. ప్రియురాలు ముద్దుల వర్షం కురిపించగా.. అతగాడు లోకాన్నే మైమరచిపోయాడు. ఎంతలా అంటే.. ఎదురుగా భారీ వాహనం వస్తున్నా అదేమీ పట్టించుకోలేదు. ప్రియుడు కూడా ముద్దులతో రెచ్చిపోయాడు.

also read :-నాపై కక్ష్యకట్టి బద్ద్నాం చేస్తున్నరు
పల్సర్‌ బైక్‌పై ఇద్దరు ప్రేమికులు పట్టపగలే రొమాన్స్ చేసుకుంటుండడంతో అటుగా వెళుతున్న వాహన దారులు ఆశ్చర్యానికి గురయ్యారు. నడి రోడ్డుపైనే ప్రేమికులు రొమాన్స్ చేసుకుంటున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. వీడియో చుసిన అందరూ వారిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘కలికాలం బాబోయ్’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘మరో అర్జున్ రెడ్డి’ అని ఇంకొకరు కామెంట్ చేశారు.

ఇలాంటి వారిని పోలీసులు పట్టుకుని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బహిరంగంగా ఇలా రెచ్చిపోవడం ఏంటని కొందరు మండిపడుతున్నారు.