Telugu News

ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలి ఒకరు మృతి: ముగ్గురికి తీవ్ర గాయాలు

నిజామాబాద్ అర్బన్  విజయం న్యూస్

0

ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలి ఒకరు మృతి: ముగ్గురికి తీవ్ర గాయాలు

(నిజామాబాద్ అర్బన్  విజయం న్యూస్):-

ఇంట్లో చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలి ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన నిజామాబాద్ లో జరిగింది. ఈ విషాద ఘటనక వివరాలు ఇలా ఉన్నాయి.

నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ ఎస్బీఐ బ్యాంక్ ప్రాంతంలో నివాసం ఉండే కళ్యాణ్ రోజులాగే ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీని మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఇంట్లోని హాలులో చార్జింగ్ పెట్టాడు. అనంతరం తాత రామస్వామి (80), నాన్నమ్మ కమలమ్మతో కలిసి అదే హాల్లో పడుకున్నాడు. మరో గదిలో రామస్వామి కుమారుడు ప్రకాశ్, కోడలు కృష్ణవేణి పడుకున్నారు.

also read :-సర్కార్ ఆసుపత్రుల్లో కార్పోరేట్ వైద్యసేవలు

బుధవారం తెల్లవారుజామున బ్యాటరీ భారీ శబ్దంతో పేలిపోయింది. శబ్ధానికి గదిలో నిద్రిస్తున్న ప్రకాశ్, కృష్ణవేణి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అంతలోనే బ్యాటరీలోని కెమికల్ హాల్లో వ్యాపించి దాని ద్వారా మంటలు రామస్వామి, కమలమ్మ, కళ్యాణ్కు అంటుకున్నాయి. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించిన కృష్ణవేణికి సైతం గాయాలయ్యాయి.

also read :-వైయస్సార్సీటీపీ వైయస్ షర్మిల పాదయాత్ర జయప్రదం చెయ్యాలి…

ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన రామస్వామిని ఆయన కుమారుడు ప్రకాష్ చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాదు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. గాయాలపాలైన కమలమ్మ, కళ్యాణ్, కృష్ణవేణి లను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. సంఘటనా స్థలాన్ని త్రీ టౌన్ ఎస్సై సాయినాథ్ పరిశీలించారు.