Telugu News

గల్లీ లో పీకలేనోడివి ఢిల్లీలో పీకుతావా

* బీ ఫారాలు అమ్ముకొని సొమ్ము చేసుకున్న బ్రోకర్లు

0

గల్లీ లో పీకలేనోడివి ఢిల్లీలో పీకుతావా
** బీ ఫారాలు అమ్ముకొని సొమ్ము చేసుకున్న బ్రోకర్లు
** రైతును ముంచిన వంచకుడివి
** ఫేక్, ఫాల్స్, ఫ్రాడ్ ఎంపీవీ
** నూకలు తినమన్నోడి తోకలు కత్తిరిస్తం
**వడ్లు కొనే వరకూ వదిలి పెట్టేదే లేదు
** కేసీఆర్ తో గోకున్నోడెవడూ చరిత్రలో మిగలలేదు
** విరుచుకుపడ్డ పీయూసీ ఛైర్మన్ జీవన్ రెడ్డి
(నిజామాబాద్ అర్బన్ – విజయం న్యూస్);-
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి గల్లీ లో పీకలేనోడివి ఢిల్లీలో పీకుతావా?అబద్దానికే అయ్యవు. నీ కుటుంబం బతుకే అవినీతి. అయ్యా కొడుకులు బీ ఫారాలు అమ్ముకొని సొమ్ము చేసుకున్న బ్రోకర్లు. రైతును ముంచిన వంచకుడివి. ఫేక్, ఫాల్స్, ఫ్రాడ్ ఎంపీవీచదువులేదు, సంజ్ఞ లేదు. గాలికి పుట్టి గాలికి పెరిగినవు. నీకు వ్యవసాయం, వడ్ల గురించి అసలు అవగాహన లేదు. సిఎం కెసిఆర్ ,మంత్రి కేటీఆర్, కవిత పై ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చిల్లర వాగుడు వాగుతావా?. నిన్ను బట్టలూడదీసి ఉరికిచ్చి కొడతం. నిన్నే కాదు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని అవమానిస్తూ

also read :-కిష్టాపురంలో దారుణ హత్య
నూకలు తినమన్నోడి తోకలు కత్తిరిస్తం.
వడ్లు కొనే వరకూ వదిలి పెట్టేదే లేదు.కేసీఆర్ తో గోకున్నోడెవడూ చరిత్రలో మిగలలేదు”అని
– పీయూసీ ఛైర్మన్ జీవన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లా టీఆర్ ఎస్ అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి
విరుచుకుపడ్డారు. నిజామాబాద్ నగరంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వడ్ల కొనుగోలు పై అరవింద్ చేసిన వ్యాఖ్యలను దిగజారుడు రాజకీయాలకు, ఆయన చిల్లరతనానికి, అవగాహన లేమికి పరాకాష్టగా అభివర్ణించారు. మండిపడ్డారు.

నేను గతంలోనే చెప్పా.
నువ్వు ఎంపీ అర్వింద్ వి కాదు ఎఫ్-3 అర్వింద్ వు. ఎఫ్-3 అంటే ఫేక్, ఫాల్స్, ఫ్రాడ్ అని.
ఎందుకంటే .. పసుపు బోర్డ్ తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చావు. పసుపు బోర్డ్ తేలేకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేసి పసుపు రైతుల ఉద్యమంలో పాల్గొంటానన్నావు. ఇన్ని రోజులైనా పసుపు బోర్డ్ తేలేక పోయావు. రైతులను నట్టేట్లో ముంచిన నయవంచకుడివి నువ్వు. నువ్వు రాసిచ్చిన బాండ్ పేపర్ ఒక ఫేక్. అందుకే నువ్వు ఓ ఫేక్ ఎంపీ వి. విద్యాబ్యాసం కోసం దొంగ సర్టిఫికెట్లు పెట్టిన నువ్వో ఫ్రాడ్ వి. నకిలీ సర్టిఫికెట్లు పెట్టినట్లు యూనివర్సిటీ ఇచ్చిన వివరణ నా దగ్గర, గూగుల్, సోషల్ మీడియాలో ఉంది. అందుకే నువ్వు ఫ్రాడ్ ఎంపీ వి. అబద్దాలు, అభూత కల్పనలతో ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్న ఫాల్స్ ఎంపీ వి. నువ్వు ఫాదర్ ఆఫ్ లయ్యరువు. ఇప్పుడు ఎల్-3ఎంపివి ” అని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు.

also read :-*డ్రగ్స్ పార్టీలో ప్రముఖుల పిల్లలు ఉన్నారా.?

నీకు సిగ్గూ శరం ఉంటేఈ ఉగాది పండుగ నుంచైనా ఎంపీ అరవింద్ అబద్దాలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు.
ఓ ఎఫ్-3,ఎల్-3, బడా జూటా, బద్మాష్, బట్టేబాజ్, బేవకూఫ్ ఎంపీ.. ఆర్మూర్ ఎమ్మెల్యే గా నీకు మరోమారు సవాల్ చేస్తున్న. నీకు దమ్మూ ధైర్యం ఉంటే వీధి పోరాటం కాదు నేరుగా నాతో పోరాడు. పోరాడే చేవ లేకుంటే అన్నీ మూసుకొని ఇంట్లో పడుకో అని జీవన్ రెడ్డి మండిపడ్డారు.

అరవింద్ నిజామాబాద్ కేడీ అని,అతడు వేసుకునే బనియన్, చెడ్డీ కూడా అవినీతి సొమ్ముతో వచ్చినవేనని, నీ అయ్య అవినీతి గురించి కాంగ్రెస్ నాయకులే కథలు,కథలుగా చెప్పుతారని ఆయన ఎద్దేవా చేశారు.
ఈ బట్టేబాజ్, బద్మాష్, బేవకూఫ్, బేఖార్ ఎంపీ..
ముందు ఇంట గెల్చి రచ్చ గెలువు. నీ కుటుంబం తినే ప్రతీ బియ్యం మెతుకు టీఆర్ఎస్ పెట్టిన భిక్షం. ఎంపీ అరవింద్ ఒక సైకో.. డ్రగ్ ఆడిక్ట్.
కేసీఆర్ , కేటీఆర్, కవితల పై ఇష్టం వచ్చినట్లు వాగితే నిజామాబాద్ జిల్లాలో తిరగనివ్వం. అని
జీవన్ రెడ్డి హెచ్చరించారు. వ్యవసాయం గురించి కిషన్ రెడ్డి కేం తెలుసు?. ఆయనొక టూరిస్ట్ మంత్రి. గుజరాతీ బేరగాళ్లకు గులాంగా మారి తెలంగాణ పౌరుషం కోల్పోయిండు.

కిషన్ రెడ్డి ఎప్పటికీ కిసాన్ కాడు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి వ్యవసాయం గురించి ఓనమాలు కూడా తెలియదు. తెలంగాణ రైతుల కష్టాలు పట్టవు ఆయన మండిపడ్డారు.రైతులతో పెట్టుకున్నోడు, కేసీఆర్ తో గోక్కున్నోడెవడూ బాగుపడలేదన్నారు.ఎర్ర జొన్న రైతుల కడుపులో బుల్లెట్లు దింపిన కాంగ్రెస్ ఏమైందో తెలుసన్నారు. రైతుల కడుపులో బుల్లెట్లు దింపిన టీడీపీ ప్రభుత్వం కూలిపోయి ఆ పార్టీ ఆఫీసు కు టూ-లెట్ బోర్డు తగిలించారన్నారు.

also read :-ఖమ్మంలో ఉమెన్ క్రికెట్ మ్యాచ్ షూరు

రైతులతో పెట్టుకున్న ప్రధాని మోడీకి పంజాబ్ లో గుండు సున్నా మిగిలిందన్నారు. రైతేడ్చిన రాజ్యం,ఎద్దేడ్చిన వ్యవసాయం బాగు పడదన్నారు. ఒకప్పుడు అన్నమో రామచంద్ర అని అలమటించిన దుస్థితి నుంచి నేడు దేశానికి అన్నం పెట్టే స్ధాయికి చేరిన తెలంగాణ రైతుల ఉసురు పోసుకుంటున్నారని, దేశాన్ని సాకుతున్న నాలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణపై వివక్ష చూపుతున్నారని ఆయన కేంద్రంపై మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతూ 23లక్షల కోట్లను ప్రజల నుంచి కేంద్ర ప్రభుత్వం దోచుకున్నదని ఆయన ఆరోపించారు.13 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన బ్యాంకు రుణాల ఎగవేత దారులను, వైట్ కాలర్ నేరస్తుల ను, కోట్లాది రూపాయల కుంభకోణాలకు పాల్పడిన అవినీతి పరులను దేశం దాటించిన నీచమైన చరిత్ర మోడీ ప్రభుత్వానిదని ఆయన విమర్శించారు.

also read :-మోడీజీ… మీరిచ్చిన మాటేమాయే

పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పదేపదే పెంచి లక్షల కోట్లు దోచుకుంటున్న కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలో వడ్ల కొనుగోలు కు 13వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఏం రోగం వచ్చిందని జీవన్ రెడ్డి దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ ది ప్రజా ప్రభుత్వ మన్నారు. రైతుబంధు పథకం కింద ఎకరానికి రూ.10,000ల చొప్పున ఇప్పటికే 50వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశాం. రైతు ప్రమాద వశాత్తు చనిపోతే రూ.5,00,000ల చొప్పున చెల్లించే బీమా అమలు చేస్తున్నాం. ఇరవై నాలుగంటల ఉచిత కరెంటు ఇస్తున్నాం.

కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కోటి ఎకరాలకు నీళ్లిచ్చే దిశగా పోతున్నాం. కేవలం రైతు సంక్షేమం కోసమే మూడున్నర లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం మాది అని ఆయన పేర్కొన్నారు. ఇక ఆందోళనలతో కేంద్రం ఊపిరి పీల్చకుండా చేస్తాం. కేంద్రం అహంకారం దిగే వరకు, మన రైతుల వడ్లు కొనే వరకు పోరాడుతాం. బీజేపీ కు ఉన్న ట్రిబుల్ ఆర్, నాలుగు ఎంపీ సీట్లను ఎగుర కొడతం అని జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఈ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి , ఏమ్మేల్సీ విజీ గౌడ్ , ZP చైర్మన్ విఠల్ రావు , మర్క్ఫెడ్ చైర్మన్ మర గంగారెడ్డి ,నిజమాబాద్ మేయర్ నితు కిరణ్ ,NUDA ప్రభాకర్ మరియు ఈగ గంగారెడ్డి పాల్గొన్నారు…