యువతిపై సామూహిక అత్యాచారం
— నిజామాబాద్ లో మరో దారుణం
— మద్యం తాగించి అత్యాచారానికి ఒడిగట్టిన దుండగులు
(నిజామాబాద్-విజయంన్యూస్)
కఠిన శిక్షలు విధిస్తున్నా.. ఎన్ కౌంటర్లు చేస్తున్నా మృగాళ్ళలో మార్పులు రావడం లేదు.. అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి.. మానవమృగాలు విజృంభిస్తూనే ఉన్నాయి.. మొన్న నిర్భయ.. నిన్న దిశ.. నేడు మరో యువతి.. ఇలా మృగాళ్ళ అకృత్యాలు ఆగడం లేదు.. తాజాగా నిజామాబాద్ లో మరో దారుణం చోటు చేసుకుంది. నలుగురు యువకులు యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతికి మద్యం తాగించి ఆ అఘాత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ అసుపత్రికి గదిలో మంగళవారం అర్థరాత్రి దారుణం జరిగింది. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది డయల్ 100కు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు యువతి మద్యం మత్తులో ఉన్నట్టు గుర్తించారు. బాధితరాలిని చికిత్స నిమిత్తం ఓ ఆసుపత్రికి తరలించారు. నిజామాబాద్ జిల్లా కేంరదంలోనే దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ కాలేజ్ వచ్చిన విద్యార్థినిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విద్యార్థిని వెంబడించి, బలవంతంగా మద్యం తాగించి మరీ యువకులు దారుణానికి తెగబడ్డారు. బస్టాండ్ సమీపంలోని ఓ ఆసుపత్రి గదిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ విషయం తెలిసిన పోలీసులు బాధితురాలిని చికిత్స కోసం జిల్లా ఆసుపత్రిలోని సఖి సెంటర్కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిసింది.
also read : – ముల్కలపల్లిలో రోడ్డుప్రమాదం
మీ స్క్రీన్ పై గంట కనిపిస్తుంది. ఆ గంటను నొక్కి, ఆ తరువాత ఆల్ వేజ్ ను ఓకే చేసి మా పేపర్ న్యూస్ ను సబ్ స్ర్కైబ్ చేయండి..