ఆ ఇద్దరికి నో చాన్స్
== అలిగిన నేతలు.. భగ్గుమంటున్న వర్గీయులు
== పార్టీ మార్పు కోసం తీవ్ర ఒత్తిడి..?
== ముందే చెప్పిన విజయం పత్రిక
== పొంగులేటి మంత్రి కేటీఆర్ తో బేటి జరిగిందా..? ప్రచారమేనా..?
== అందులో నిజమెంతా..?
(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్);-
ఖమ్మం జిల్లానే రాజకీయ చక్రబందంలో ఉంచి నడిపించగల జనబలం కల్గిన నాయకులు ఆ ఇద్దరు నేతలకు మరోసారి ఎదురీత తప్పలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే రాజకీయ పెద్దలుగా ఉన్న వీరు చిన్నల సభతో పాటు పెద్దల సభకు కూడా అవకాశం రాకపోవడం గమనర్హం. ఎమ్మెల్సీ అవకాశం తప్పినప్పటికి రాజ్యసభ తప్పదని అందరు ఊహించుకుంటున్న తరుణంలో సీఎం కేసీఆర్ వారిద్దరికి, వారి అభిమానులకు షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు రాజ్యసభ స్థానం కోసం టిక్కెట్ ను ఆశించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి టిక్కెట్ దక్కలేదు.ఈ ఇద్దరికి కాకుండా ఆ ఇద్దరికి అవకాశం దక్కడం మరో ట్విస్ట్. దీంతో పొంగులేటి, తుమ్మల ఇద్దరు అలకబూనినట్లుగా తెలుస్తోంది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో కచ్చితంగా మాకు అవకాశం దక్కుతుందని భావించిన పొంగులేటి, తుమ్మల వర్గీయులకు నిరాశే మిగిలింది. దీంతో వారి వర్గీయులు, అభిమానులు కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ మారాలని వారిద్దరు నేతలపై అభిమానులు, వర్గీయులు తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం.
== పొంగులేటి మంత్రి కేటీఆర్ బేటి జరిగిందా..?
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రాజ్యసభ ఖాయం అంటూ గత కొద్ది రోజులుగా ముమ్మరంగా ప్రచారం జరిగింది. మీడియాలో, సోషల్ మీడియాలో బోలేడన్ని న్యూస్ వచ్చాయి.. రాజ్యసభ కోసం సీఎం కేసీఆర్ నుంచి పిలుపు వచ్చిందని, మంత్రి కేటీఆర్ ను కలుస్తున్నారని కొంత మంది ప్రచారం చేస్తే కొన్ని పత్రికలు కూడా ద్రువీకరించాయి. అలాగే మరికొంత మంది రాజ్యసభ స్థానం వద్దని పొంగులేటి సీఎం కేసీఆర్ కు షాక్ ఇచ్చారని, పెద్దల సభకు కాకుండా అసెంబ్లీకి అవకాశం కల్పించాలని మరికొన్ని పత్రికలు కథనాలు ప్రచురితం చేశాయి. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రాజ్యసభ విషయంలో మంత్రి కేటీఆర్ నుంచి కానీ సీఎం కేసీఆర్ నుంచి పిలుపు వచ్చిందా..? ఆ విషయంలో పొంగులేటి మంత్రి కేటీఆర్ ను కలిశారా..? అనే ప్రశ్నలకు ఇప్పటి వరకు సమాధానాలు లభించలేదు.
also read :-నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి పాత నేరస్తుడు పరారీ
అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రాజ్యసభ అవకాశం కల్పిస్తామని సీఎం కేసీఆర్ చెబితే నాకు వద్దు అని చెప్పాడని వచ్చిన ప్రచారంలో వాస్తవం లేదని మాత్రం స్పష్టమవుతోంది. మంత్రి కేటీఆర్ ను కలిసింది కూడా తప్పుడు ప్రచారంగానే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మంత్రి కేటీఆర్ ను కలవాల్సి వస్తే ఇద్దరు ఒక పార్టీ వారే కాబట్టి రహస్యంగా కలవాల్సిన అవసరం లేదని, కలిసినట్లుగా ఒక్క పోటో అయిన బయటకు వచ్చేది కదా..? అంటూ కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అది కేవలం మీడియాలో వచ్చిన కథనాలు మాత్రమేనని కొట్టిపారేస్తున్నారు. ఈ విషయంపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే నాయకులతో కూడా విజయం పత్రిక ప్రతినిధి మాట్లాడగా, వారు కూడా మంత్రి కేటీఆర్ ను కలిసినట్లుగా కానీ, కలుస్తున్నట్లుగా కానీ సమాచారం లేదని చెప్పారు. మొత్తానికి ప్రజా, జనబలం ఉన్న నేతలకు రాజ్యసభ స్థానం రాకపోవడంపై రాజకీయ విశ్లేషకులు పలు విధాలుగా విశ్లేషణ చేస్తున్నారు.
== ముందే చెప్పిన విజయం పత్రిక
ఆ ఇద్దరికి రాజ్యసభ స్థానం దక్కకపోవచ్చనే విషయాన్ని విజయం తెలుగు దినపత్రిక వారం రోజుల ముందే చెప్పింది.. ‘ఆ ఇద్దరికి నో చాన్స్’ అంటూ కథనాన్న ప్రచురితం చేసింది. ఇద్దరిలో ఏ ఒక్క నేతకు రాజ్యసభ స్థానం కల్పించిన తప్పకుండా జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని, అందుకే ఇద్దరికి సీటు దక్కకపోవచ్చని విజయం పత్రిక ముందుగానే కథనాన్ని ప్రచురితం చేసింది. విజయం పత్రిక చెప్పినట్లుగా ఆ ఇద్దరు నేతలకు సీటు దక్కకపోగా ఖమ్మం జిల్లాకు ప్రాతినిద్యంను కల్పించింది పార్టీ. చూద్దాం రాబోయే రోజుల్లో ఆ ఇద్దరు నేతలు ఏం చేయబోతారో..?పార్టీ భవిష్యత్ ఎలా ఉంటుందో..? వేచి చూడాల్సిందే..?