Telugu News

రాష్ట్రంలో లాక్ డౌన్ అవసరం లేదు**

-ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలి..*

0

రాష్ట్రంలో లాక్ డౌన్ అవసరం లేదు**
-ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలి..*
_విద్యాసంస్థలకు 8 నుంచి 16 సెలవులు**

_ప్రజలంతా కొవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలి**

_రాష్ట్రంలో ఒమిక్రాన్ భయం లేదు**

_*15 రోజుల్లో ఆసుపత్రిలలో ఖాళీలు భర్తీ చేయాలి*

_బస్తీ దవాఖానాల విస్తరణ చేస్తాం**

_వైద్య ఆరోగ్యశాఖ సమీక్షలో సీఎం కేసీఆర్‌ ఆదేశం**

(హైదరాబాద్‌-విజయం న్యూస్):-

తెలంగాణలో ఇప్పటీకప్పుడు లాక్ డౌన్ అవసరం లేదని.. ఉదంతాలు ఎవరు నమ్మోద్దని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ భయం లేదని..ఎవరు భయాందోళన చెందాళ్సిన అవసరం లేదని, అయితే తప్పకుండా నిబంధనలు పాటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. గతంలో 11 నుంచి సంక్రాంతి సెలవులు ఇవ్వాలనుకున్నా.. రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసుల నేపథ్యంలో మూడు రోజుల ముందే వాటిపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్‌పై ప్రజలు భయాందోళన చెందనవసరం లేదని, నిరంతరం అప్రమత్తంగా ఉంటూ స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలన్నారు. పనిచేసే చోట్ల అప్రమత్తత పాటిస్తూ మాస్క్‌లు ధరించాలని, నిబంధనలను విధిగా పాటించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

also read:-17 లక్షల భారతీయఖాతాలపై వాట్సాప్ నిషేధం..

ప్రభుత్వం కరోనాను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉందన్నారు. కేసులు పెరుగుతున్నందున రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో మౌలిక వసతులన్నింటినీ పూర్తిస్థాయిలో మెరుగుపరచాలని.. పడకలు, ఆక్సిజన్‌, ఔషధాలు పరీక్ష కిట్లను అవసరం మేరకు సమకూర్చుకోవాలని ఆదేశించారు. అన్ని దవాఖానాల్లో వైద్యులంతా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఏ కారణం చేతనైనా ఖాళీలు ఏర్పడితే 15 రోజుల్లో భర్తీ చేసుకునేలా విధివిధానాలు రూపొందించాలన్నారు. హైదరాబాద్‌ తరహాలో అన్ని నగరపాలక సంస్థల్లో సామాన్యులకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు మరిన్ని బస్తీ దవాఖానాలను ఏర్పాటుచేయాలని సూచించారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో వైద్య ఆరోగ్యశాఖపై సీఎం సోమవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించారు. మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘ పెరుగుతున్న జనాభా అవసరాల రీత్యా రాష్ట్రంలో డాక్టర్లు, పడకలు, ఇతర మౌలిక వసతులు పెరగాలి.

also read :-ఎమ్మెల్యే తనయుడు వనమా రాఘవపై ఎఫ్ఐఆర్

నూతనంగా నిర్మించుకున్న సమీకృత కలెక్టర్‌ కార్యాలయాల్లోకి పలు శాఖల కార్యాలయాలు మారుతున్న దృష్ట్యా ఖాళీ అయిన పాత కలెక్టరేట్లను, శాఖల భవనాలను, స్థలాలను విద్యా, వైద్యశాఖకు బదలాయించాలి. ప్రభుత్వాసుపత్రుల్లో పడకల్లో దాదాపు 99 శాతానికి ఆక్సిజన్‌ సమకూరింది. మిగిలిన ఒక్క శాతానికి కూడా దాన్ని కల్పించాలి. రాష్ట్రంలో ఆక్సిజన్‌ 500 మెట్రిక్‌ టన్నులకు పెంచాలి. హోం ఐసొలేషన్‌ కిట్లను కోటికి పెంచాలి. పరీక్ష కిట్లను రెండు కోట్లకు పెంచాల’’ని చెప్పారు.

మరిన్ని బస్తీ దవాఖానాలు

హైదరాబాద్‌లోని బస్తీ దవాఖానాలు సామాన్యులకు మంచి సేవలనందిస్తున్నాయి. జీహెచ్‌ఎంసీతో పాటు ఇతర నగరాల్లో బస్తీదవాఖానాల సంఖ్యను మరింత పెంచాలి. హెచ్‌ఎండీఏ పరిధిలోని కంటోన్మెంట్‌ జోన్‌లో వార్డుకొకటి చొప్పున 6 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తాం. రసూల్‌పురలో రెండు, ఎల్బీనగర్‌, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, ఉప్పల్‌, మల్కాజిగిరి, జల్‌పల్లి, మీర్‌పేట, పీర్జాదీగూడ, బోడుప్పల్‌, జవహర్‌నగర్‌, నిజాంపేట్‌లలో ఒక్కొక్కటి ఏర్పాటు చేయాలి. వరంగల్‌ కార్పొరేషన్‌ 4, నిజామాబాద్‌ 3, కరీంనగర్‌, రామగుండం, మహబూబ్‌నగర్‌, ఖమ్మం, నల్గొండల్లో రెండేసి.. జగిత్యాల, సూర్యాపేట, సిద్దిపేట, మిర్యాలగూడ, కొత్తగూడెం, పాల్వంచ, నిర్మల్‌, మంచిర్యాల, తాండూర్‌, వికారాబాద్‌, బోధన్‌, ఆర్మూర్‌, కామారెడ్డి, సంగారెడ్డి, జహీరాబాద్‌, గద్వాల, వనపర్తి, సిరిసిల్ల, తెల్లాపూర్‌, బొల్లారం, అమీన్‌పూర్‌, గజ్వేల్‌, మెదక్‌లో ఒక్కొక్కటి చొప్పున బస్తీ దవాఖానాలు ప్రారంభిస్తాం’’ అని సీఎం తెలిపారు.

లాక్‌డౌన్‌ అవసరం లేదు

ఈ సందర్భంగా వైద్యాధికారులు రాష్ట్రంలోని పరిస్థితులను సీఎంకు నివేదించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించే పరిస్థితులు లేవని తెలిపారు. రాష్ట్రంలో కరోనా ప్రబలే ప్రమాదం ఉన్నందున బహిరంగ సభలు, ర్యాలీలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని, ప్రభుత్వ నిబంధనలను పాటించడం ద్వారా కరోనాను నియంత్రించవచ్చని తెలిపారు.