Telugu News

బిజెపి ఎన్ని కుట్రలు చేసినా బిఆర్ఎస్ పార్టీని ఏమి చేయలేరు: రేగా 

ప్రశ్నాపత్రాలు లీకేజీ సూత్రధారి పాత్రధారి బండి సంజయ్ అన్న రేఖ..

0
బిజెపి ఎన్ని కుట్రలు చేసినా బిఆర్ఎస్ పార్టీని ఏమి చేయలేరు: రేగా 
== ప్రశ్నాపత్రాలు లీకేజీ సూత్రధారి పాత్రధారి బండి సంజయ్ అన్న రేఖ..
== యువత జీవితాలతో ఆడుకుంటున్న ది బిజెపి నాయకులు కారా అని ప్రశ్నించిన రేగా…
 
== కారకులు ఎవరైనా వదిలి పెట్టేది లేదంటున్నరేగా…
మణుగూరు ఏప్రిల్ 5 (విజయం న్యూస్)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనుబాక నియోజకవర్గం లో మణుగూరులో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ లో ప్రసంగించిన రేగా…..

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజలకు అందిస్తున్నఅభివృద్ధి సంక్షేమ పధకాలు చూసి ఓర్వలేకనే కేసీఆర్ పై బీజేపీ ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తుందని తెలంగాణ ప్రభుత్వ విప్, ,పినపాక శాసన సభ్యులు రేగా కాంతారావు అన్నారు. బుధవారం మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జడ్పిటీసీ పోశం నరసింహారావు ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రేగా పాల్గొని మాట్లాడారు.
కేసీఆర్ ను చూసి,కేసీఆర్ చేస్తున్నఅభివృద్ధి సంక్షేమ పధకాలను చూసి ఓర్వలేకనే బీజేపీ నీచమైన రాజకీయం చేస్తున్నారన్నారు. కేసీఆర్ ను ఢీ:కొట్టే దమ్ము బీజేపీకి లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు రేగ కాంతారావు….తెలంగాణలో నేడు అభివృద్ధి సంక్షేమ పధకాలు పేద ప్రజలకు అందుతున్నాయంటే దానికి కారణం కెసిఆర్ అన్నారు.రాష్ట్రంలో పేపర్ లీకేజీ జరుగుతుందంటే దానికి సూత్రధారి,పాత్రధారి బండి సంజయ్ అని కీలక వ్యాఖ్యలు చేశారు. యువతకు చదువును కూడా దూరం చేస్తున్నది బండి సంజయ్ కాదా ?అని ధ్వజమెత్తారు రేగా కాంతారావు….
విద్యార్థులను 6నెలలు చదువును పక్కన పెట్టి రాజకీయంలోకి రమ్మన్నది బండి సంజయ్ కాదా ?అని ప్రశ్నించారు.యువతను టార్గెట్ చేస్తున్నది వారి జీవితాలను నాశనం చేస్తున్నది ,బీజేపీ ప్రభుత్వం కాదా అని మండిపడ్డారు రేగా…. పేపర్ లీకేజీ ప్రశాంత్ అనే వ్యక్తితో చేపించలేదా? అని ప్రశ్నించారు.
ప్రశాంత్  అనే వ్యక్తితో 142 ఫోన్ కాల్స్ మాట్లాడారని కీలక వ్యాఖ్యలు చేశారు రేగా కాంతారావు.బండి సంజయ్ గుర్తు పెట్టుకో త్వరలో విద్యార్థులు నిన్ను బండకేసి కొట్టడం కాయమన్నారు.నేడు దేశంలో అరాచకం,దోపిడీ, నిరంకుశ పాలన నడుస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.అరాచకం,దోపిడీ,నిరంకుశ పాలన తిప్పికొట్టాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ దేశ రాజకీయంలోకి వస్తున్నారన్నారు.కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలనుంచి దేశ రాజకీయాల వరకు ఎదిగిన కేసీఆర్ ని చూసి సహించలేక బీజేపీ ప్రభుత్వం నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు రేగా…తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన బజ్జట్ ను కూడా బీజేపీ రానివ్వకుండా చేస్తున్నదని కీలక వ్యాఖ్యలు చేశారు.గుజరాత్ రాష్ట్రం అంత మాయ,డొల్ల అని వ్యాఖ్యానించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ జోలికి వస్తే సహించేది లేదని ఆయన బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.కేసీఆర్ కోసం ఎంత దూరం అయిన రావడానికైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు,తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మీడియా సమావేశంలో పీఏసీఎస్ ఛైర్మెన్ కుర్రి నాగేశ్వరావు,టౌన్,పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు,ముత్యం బాబు,నాయకులు యాదగిరి గౌడ్,బొలిశెట్టి నవీన్,అక్కినపల్లి సంజీవ రెడ్డి, కీసర శ్రీనివాస్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు.