Telugu News

ఎవరెన్ని యాత్రలు చేసినా ఫలితం శూన్యం

తెలంగాణలో ఎవరెన్ని యాత్రలు చేసినా ఫలితం శూన్యమని ఎంపీ బండి సంజయ్ పాదయాత్రలు చేసినా, మోకాలి యాత్రలు చేసినా అవి కాశీ యాత్రలే అవుతాయని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎద్దేవా చేశారు

0

ఎవరెన్ని యాత్రలు చేసినా ఫలితం శూన్యం

★ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

 (ఖమ్మం – విజయం న్యూస్)

తెలంగాణలో ఎవరెన్ని యాత్రలు చేసినా ఫలితం శూన్యమని ఎంపీ బండి సంజయ్ పాదయాత్రలు చేసినా, మోకాలి యాత్రలు చేసినా అవి కాశీ యాత్రలే అవుతాయని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. తెలంగాణ 2014 కు ముందు ఆ తర్వాత ఎలా ఉందో ప్రజలకు తెలుసునని ప్రజల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారన్నారు.

కార్యకర్తలే తప్ప ప్రజలు లేని యాత్రలు, కుర్చీపై ధ్యాసే కానీ ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేని నాయకులు యాత్రలంటూ బయల్దేరుతున్నారని అధికారంపై యావతో ఉన్న డొల్ల నాయకత్వం పట్ల సదరు పార్టీల్లోని శ్రేణుల్లోనే నిరాసక్తత వ్యక్తమవుతుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.

also read :-8 ఏండ్లుగా ఇంటి స్థలాలు ఎందుకు ఇవ్వలేదు..?: భట్టి

సీఎం కేసీఆర్‌ విజన్‌, ప్లానింగ్‌, పాలనా దక్షత, డైనమి క్‌ నాయకత్వంలో రాష్ట్రం బంగారు తెలంగాణ వైపు పరుగులు పెడుతున్నదని చెప్పారు. జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో రాష్ట్ర వృద్ధి రేటు దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి అజయ్ తెలిపారు. జీఎస్డీపీలో రాష్ట్రం 11.2% శాతంతో అగ్రగామిగా నిలిచిందని, దేశ తలసరి ఆదాయం రూ.1,49,848 ఉండగా, తెలంగాణలో రూ.2,78,833 ఉన్నదని చెప్పారు.

also read :-మావోయిస్టుల విధ్వంసం

బండి పాదయాత్ర చేసినా ఆయన ప్రజలకు చెప్పేది ఏమీ ఉండదని సంజయ్ లాంటి వారిని ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని తెలిపారు. యాత్రలలో బండి సంజయ్ ప్రజలకు ఏం చెబుతాడని పెట్రోల్ 100, డీజిల్ 100, గ్యాస్ 1000 కి పెంచినం అని చెబుతాడా? ఓట్లు వేస్తే మళ్లీ డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచుతామని చెబుతారా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.