Telugu News

ఎలాంటి ఉపయోగం లేని బడ్జెట్ : జావిద్

సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేని బడ్జెట్.

0

ఎలాంటి ఉపయోగం లేని బడ్జెట్ : జావిద్
సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేని బడ్జెట్..

ఇది. అలాగే తెలంగాణకు ఈ బడ్జెట్ లో ఎలాంటి ఉపయోగం లేదని ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండీ జావీద్ విమ్మర్శించారు.. విభజన సమయంలో నాటి యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన అంశాలపై ఎక్కడా ప్రకటన చేయలేదు. బడ్జెట్ లో తెలంగాణకు మొండి చేయి..! బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ లేదు.. ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లేదు.. ఐటీఐఆర్ లేదు.. తెలంగాణకు ఏమీ కేటాయించని ఆర్థిక మంత్రి నిర్మలమ్మ… ప్రైవేటీకరణ ప్రక్రియను మాత్రం ఆపేది లేదని చెప్పకనే చెప్పారు. ఆదాయపన్నుపై ఎలాంటి ఎలాంటి కొత్త ప్రతిపాదనలు లేవు.. ఏడేళ్లుగా ఆదాయపన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయని మోదీ ప్రభుత్వం.

also read ;-తన భూమిని కాపాడలని కలెక్టర్ వినతి పత్రం..

దేశానికి వెన్నుముకైన అన్నదాతల ఆత్మహత్యలు, పెరుగుతున్న ఎరువుల ధరలు, తగ్గుతున్న మద్దతు ధరలపై ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా ఒక ప్రకటన చేయకపోవడం దారుణం. వ్యవసాయానికి సంబంధించి కనీస మద్దతు ధరను రెండింతలు చేస్తామని గతంలో ప్రకటించారు. దీనిపైనా బడ్జెట్ ప్రసంగంలో ఎటువంటి ప్రకటనా రాలేదు.

ఆత్మనిర్బర్ భారత్ తో 16 లక్షల ఉద్యోగాలు ఎక్కడ కల్పించారో బీజేపీ ప్రభుత్వం చెప్పలి. వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నిర్మలమ్మ చేసిన ప్రకటన అత్యంత హాస్యాస్పదంగా ఉంది. ఏటా రెండుకోట్ల ఉద్యోగాలని ఎన్నకల సమయంలో మోదీ చేసిన హామీ అబద్దమని నిర్మలమ్మ తాజా ప్రకటనతో స్పష్టమైంది.

క్రిష్టో కరెన్సీపై ఎటువంటి క్లారిటీలు ఇవ్వలేదు. వచ్చే మూడేళ్లలో 400 వందే భారత్ రైళ్లను ప్రకటించిన ఆర్థిక మంత్రి.. రెండేళ్లకిందట తెలంగాణకు మంజూరు చేసిన రైళ్లను ఇంకా పట్టాలెక్కించలేదు. గతంలో హైదరాబాద్ నుంచి వందే భారత్ రైలును ప్రవేశపెడతున్నట్లు 2021లో ప్రకటించినా ఇప్పటివరకూ పట్టాలెక్కలేదు. అలాగే సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ ఒక భ్రాంతిగా మారింది.

రక్షణ రంగంలో ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పించడం.. దేశ భద్రతను ఫణంగా పెట్టడమే. డీఆర్‌డీఓ, ఇతర రక్షణ పరిశోధన సంస్థల భాగస్వామ్యంతో ప్రైవేటు సంస్థలకు అవకాశం కాంగ్రెస్ పాలకులు ఎంతో దూరద్రుష్టితో ఏర్పాటు చేసిన ఎల్.ఐ.సీ ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం.. అత్యంత దుర్మార్గం.

దేశంలో అధికారికంగా మూడుకోట్ల మంది నిరుద్యోగులు ఉన్నట్లు ప్రభుత్వ లేక్కలే చెబుతున్నాయి. కోవిడ్ మూలంగా దేశంలో 21 కోట్ల మంది జనభా దారిద్ర్య రేఖకు కిందకు వచ్చారు. వాళ్ల గురించి ఈ బడ్జెట్ లో ఎటువంటి ప్రకటనా లేదు. పెరిగిన నిత్యావసర ధరలు, డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ తగ్గింపుపైనా ఆర్థిక మంత్రి ఎక్కడా మాటవరసకైనా మాట్లాడలేదు. బీజేపీకి అనుకూలంగా చందాలు ఇచ్చే వ్యాపార వర్గాలకు మాత్రమే అనుకూలంగా రూపొందించిన బడ్జెట్ మాత్రమే ఇది.

మోదీ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ కలవరిస్తున్న మేకిన్ ఇండియాలో భాగంగా డిఫెన్స్ రంగానికి ఏమీ చేయలేదు. చైనా యాప్స్ బ్యాన్ చేశామని చెప్పుకునే మోదీ ప్రభుత్వం… చైనాతో వ్యాపార సంబంధాలను మరింత పటిష్టం చేసుకుంది. అందుకు నిదర్శనం.. పెరిగిన ఎగుమతలు.. దిగుమతుల విలవనే.

also read;-చంద్రుగొండలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఇక కేసీఆర్ విషమం తీసుకుంటే దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్లుగా ఉంది. ఇన్నేళ్లు ఈ సోయి కేసీఆర్ కు ఎక్కడ పోయిందో? అర్థం కావడం లేదు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మొదటనుంచి దన్నుగా ఉన్నది కేసీఆరే. నోట్ల రద్దు బ్రహ్మాండం అని ఎగిరెగిరి అందరికంటే ముందే.. నిర్ణయాన్ని కేసీఆర్ సమర్థించారు. ఇలాంటి ప్రధాని లేడని పొగిడాడు. జీఎస్టీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలోనూ బీజేపీకి మద్దతు ఇచ్చాడు. అంటే అప్పుడు తాగి మాట్లాడినట్లా.. ఇప్పుడు మత్తు దిగినట్లు అనుకోవాలా??

కేసీఆర్ మత్తులో ఉంటూ.. గమ్మత్తుగా తెలంగాణ ప్రజలను చిత్తు చేయాలని అనుకుంటున్నాడు.. అది జరగని పని.

కేంద్రంలో బీజేపీపై.. రాష్ట్రంలో టీఆర్ఎస్ పై ప్రజాగ్రహం మొదలైంది. రాష్ట్రంలో బీజేపీని తిడితే మళ్లీ అధికారంలోకి రావచ్చని ఎన్నికల సలహాదారులు ఇచ్చిన సలహాని కేసీఆర్ అమలు చేస్తున్నాడు.

తెలంగాణ ఏమీ పశ్చిమ బెంగాల్ కాదు.. మమతా బెనర్జీ మొదటనుంచీ కాంగ్రెస్ రక్తంతో పెరిగింది. కాబట్టి మోదీపై తిరుగులేని పోరాటం చేస్తోంది. అక్కడ చేసింది ఇక్కడ చేసి లబ్దిపొందాలనుకుంటే జరగని పని.

మమతా బెనర్జీతో పోల్చుకునే స్థాయి కేసీఆర్ కు లేదు. మమతా బెనర్జీకి.. కేసీఆర్ కు మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.

కేసీఆర్ నువ్వు నిజంగా బీజేపీని విమర్శిస్తే.. నీకు చిత్తశుద్ధి ఉంటే.. వెంటనే పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర సుంకాన్ని తగ్గించలని డిమాండ్ చేశారు.