Telugu News

రేపే రాయల నామినేషన్?..

సాయంత్రానికి అధిష్టానం ఎంపీ అభ్యర్థి పై నుంచి ప్రకటన వెలువడే అవకాశం..*

0

*రేపే రాయల నామినేషన్?..*

*సాయంత్రానికి అధిష్టానం ఎంపీ అభ్యర్థి పై నుంచి ప్రకటన వెలువడే అవకాశం..*

*ప్రకటన వెలువడక పోతే రేపు ఉదయం 11.16 నిముషాలకు నామినేషన్ ముహూర్తం..

(ఖమ్మం -విజయం న్యూస్)

ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి పై ఇంకా సందిగ్ధం వీడలేదు.నామినేషన్ వేసేందుకు ఇంకా రెండు రోజులు సమయం మాత్రమే ఉండగా ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించక పోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు మొదటి నుంచి పార్టీలో ఉన్న సీనియర్ నేత రాయల నాగేశ్వరరావు నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు.24 న ఉదయం 11.16 నిముషాలకు ముహూర్తం ఖరారు చేశారు. ఇప్పటికే ఆయన నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. అధిష్టానం నుంచి ఈరోజు సాయంత్రం వరకు ప్రకటన రావచ్చని ఆ పార్టీ నేతలు చెపుతున్నారు.