Telugu News

*6న నామినేషన్ వేస్తున్నా…. ఆశీర్వదించండి: బండి సంజయ్ 

ఎంపీ కార్యాలయంలో పార్టీ జోనల్ ఇంఛార్జ్, సహా ఇంఛార్జ్ లతో సమావేశమైన బండి*

0

*6న నామినేషన్ వేస్తున్నా…. ఆశీర్వదించండి: బండి సంజయ్ 

*బీఆర్ఎస్ పాలనలో దారి మళ్లుతున్న కేంద్ర నిధులు*

*నిధుల సద్వినియోగం కావాలంటే బీజేపీకి అవకాశమివ్వండి*

*ప్రజాస్వామ్యబద్దంగా బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం*

*మేడిగడ్డలో పిల్లర్లు కుంగిపోయినా కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు?*

*ముమ్మాటికీ అవి జన వశీకరణ క్షుద్ర పూజలే*

*కరీంనగర్ లో తనను కలిసి టీవీ ఛానళ్లతో బండి సంజయ్ వ్యాఖ్యలు*

*ఎంపీ కార్యాలయంలో పార్టీ జోనల్ ఇంఛార్జ్, సహా ఇంఛార్జ్ లతో సమావేశమైన బండి*

ఎన్నికల ప్రచార సరళిపై సమీక్ష

(కరీంనగర్ -విజయం న్యూస్)

అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈనెల 6న బీజేపీ కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్ధిగా నామినేషన్ వేస్తున్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. ‘‘కరీంనగర్ ప్రజలంతా ఆశీర్వదించాలని కోరుతున్నా. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నా.

ఇది కూడా చదవండి;- వైరాలో ప్రేమజంట ఆత్మహత్య

కేంద్ర నిధులన్నీ కరీంనగర్ లో దారి మళ్లుతున్నయ్. అభివ్రుద్ది జరగాలంటే నిధులు సద్వినియోగం కావాలంటే బీజేపీకి అవకాశమివ్వాలని వేడుకుంటున్నా.’’ అని కోరారు. కొద్దిసేపటి క్రితం కరీంనగర్ లోని కమాన్ చౌరస్తా సమీపంలో తనను కలిసిన టీవీ ఛానళ్లు అడిగిన ప్రశ్నలకు బండి సంజయ్ సమాధానమిచ్చారు. ముఖ్యాంశాలు…

ప్రజాస్వామ్యబద్దంగా బీజేపీ అధికారంలోకి రాబోతోంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారుతున్నయ్. ప్రజలంతా బీజేపీవైపు చూస్తున్నారు. గత మూడేళ్లలో జరిగిన ఉప ఎన్నికలతోపాటు జీహెచ్ఎంసీసహా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనం.

ఇది కూడా చదవండి:-;పేపర్ లీకేజ్ కి మంత్రి కేటీఆర్ బాధ్యుడు: బీజేపీ 

14 వందల మంది బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో చీమల పుట్టలో పాము దూరినట్లుగా కేసీఆర్ అధికారాన్ని చేజిక్కుంచుకుని తెలంగాణను సర్వనాశనం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనను ప్రజలంతా చూశారు. బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నా.

తెలంగాణలో ఈరోజు విడుదల చేసిన 2వ లిస్టులో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాం. అందరి అభిప్రాయాలు తీసుకుని ఆశావహ నాయకులను సమన్వయం చేసుకుంటూ 3వ లిస్ట్ పైనా కసరత్తు చేస్తున్నాం.

30 వేల కోట్ల అంచనాతో రూపొందించిన కాళేశ్వరం ప్రాజెక్టును కమీషన్ల కోసం లక్షా 30 వేల కోట్లతో నిర్మించారే తప్ప ప్రజలకు ఉపయోగపడింది లేదు. ఒక్క రైతుకు ఉపయోగపడింది లేదు. నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వలేదు. ఇసుక దందాతో చెలరేగిపోతున్నరు. మేడిగడ్డలో 8 పిల్లర్లు కుంగిపోయిన తరువాత కూడా సమీక్ష జరపని వ్యక్తి కేసీఆర్. కేంద్ర బ్రుందం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించింది. కేంద్రపై మాకు నమ్మకముంది. వాస్తవ నివేదిక ఇస్తుందని భావిస్తున్నాం. అట్లాగే కాళేశ్వరంకు జరిగిన నష్టాన్ని కేసీఆర్ నుండి ముక్కుపిండి వసూలు చేయాలి.

ఇది కూడా చదవండి:- ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి ఆయనే : ప్రకటించిన సీఎం

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తూట్లు పొడిచిన కేసీఆర్ ఇచ్చిన హామీలను కూడా విస్మరించి ప్రజలకు అన్యాయం చేసిండు. ప్రజలు కోపంతో ఉన్నారని, జనం బీఆర్ఎస్ కు ఓట్లేసే పరిస్థితి లేదని తెలిసి పైకి రాజ శ్యామల యాగం చేస్తున్నామని చెబుతూ… లోపల మాత్రం ‘జన వశీకరణ క్షుద్ర పూజలు’ చేస్తున్నడు. సమాజ హితం కోసం చేసే పూజలకు దేవుడి ఆశీస్సులుంటాయే తప్ప జనం ఉసురుపోసుకునే పూజలను సహించడనే వాస్తవాన్ని కేసీఆర్ గుర్తుంచుకుంటే మంచిది.

మరోవైపు బండి సంజయ్ కొద్ది సేపటి క్రితం ఎంపీ కార్యాలయంలో అసెంబ్లీ నియోజకవర్గ జోనల్ ఇంఛార్జ్, సహ ఇంఛార్జ్ లతో సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ బూత్ స్థాయిలో నిర్వహించాల్సిన ప్రచారంపై చర్చించారు. ప్రచార సామాగ్రితోపాటు కరపత్రాలు కూడా సిద్ధంగా ఉన్నాయని, ప్రతి ఒక్క కార్యకర్త ఇంటింటికీ తిరిగి కరపత్రాలు చేరవేయాలని కోరారు.