పొంగులేటికి ‘దయ’ చూపడం లేదా..?
== ఆయన దూరమైనట్టేనా..? ‘హ్యాండ్’ ఇస్తున్నారా..?
== 12 న సత్తుపల్లిలో పొంగిలేటి ఆత్మీయ సమ్మేళనం
== ఏర్పాట్లలో నిమగ్నమైన మువ్వ
== 10 నుంచి 15 వేల మంది హాజరవుతారని అంచనా
== పొంగులేటి గూటిలో ఏం జరుగుతోంది..?
(సత్తుపల్లి-విజయం న్యూస్):
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి స్వంత నియోజకవర్గం.. స్వస్థలం కూడా..? ఇతర నియోజకవర్గాలకంటే భిన్నంగా ఇక్కడ ఆయన సభ నిర్వహించాలి.. ఇతర నియోజకవర్గాలేమో కానీ ముందస్తుగా ఆయన స్వంత నియోజకవర్గం కాబట్టి ఎవరు ఊహించని విధంగా ఇక్కడ ఆత్మీయ సమ్మెళనం అదిరిపోయే విధంగా నిర్వహించాలి.. అవసరమైతే అభ్యర్థిని ప్రకటించాలి.. లేదంటే అత్యధిక జనం తరలివచ్చే చర్యలు చేపట్టాలి.. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా జరుగుతున్నట్లుగానే కనిపిస్తోంది.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, సత్తుపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా భావించిన నాయకుడు పొంగులేటి పట్ల ‘దయ’ చూపించడం లేదన్నట్లుగా కనిపిస్తోంది.
ఇదికూడా చదవండి: ‘సత్తుపల్లి’ లో అక్రమ మట్టి మాఫియా
ఇటీవలే ఆనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ఆ నాయకుడు ఆత్మీయ సమ్మెళనంకు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ కావాల్సి ఉంది.. కానీ ఆయన ఈ ఆత్మీయ సభకు దూరమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.. అందులో భాగంగానే ఆత్మీయ సమ్మెళనానికి మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు బాధ్యతలు తీసుకున్నారు.. ఆయనే అన్ని తానై చూసుకుంటున్నారు.. ఇంతకు ఇంత కథ ఎందుకుంటే.. ఈ నెల 12న సత్తుపల్లిలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం పట్ల కొంత ఉత్కంఠ నెలకొంది. ఈ సమ్మెళనానికి నమ్ముకున్నోళ్లు వస్తున్నారా..? హ్యాండ్ ఇస్తున్నారా..? అర్థం కావడం లేదు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే
ఖమ్మం జిల్లాలో సత్తుపల్లికి ప్రత్యేకమైన స్థానం ఉంది. సత్తుపల్లి కేంద్ర నుంచి ఎందరో రాజకీయ ఉద్దండలు అందించిన చరిత్ర సత్తుపల్లికి ఉంది. ప్రస్తుత రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్న దృష్ట్యా, ఖమ్మం జిల్లాలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ముఖ్య నాయకుల్లో పరిచయం అక్కరలేని మనిషిగా మంచి గుర్తింపు సాధించిన పొంగిలేటి, సత్తుపల్లి నియోజకవర్గం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించబోతున్నారు. అందుకు ముహుర్తం కూడా ఖరారు చేశారు.
ఇదికూడా చదవండి: “తగ్గేదేలే అంటున్న” ఇసుక మాఫియా
జిల్లా ప్రజలందరూ పొంగులేటి వైపు ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో, రేపు జరగబోయే ఆత్మీయ సమ్మేళనం సత్తుపల్లి రాజకీయాల్లో పెను మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే పొంగిలేటి నూతన పార్టీ ఆవిర్భావానికి పునాదులు వేస్తున్నట్లు మీడియాలో వార్తల వస్తున్న తరుణంలో తెలంగాణలో నూతన పార్టీ ఏర్పడితే అది పొంగులేటి సారధ్యంలో ఏర్పడితే సత్తుపల్లి రాజకీయం ఖమ్మం జిల్లాతో పాటు పెను మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వంత నియోజకవర్గం, చాలా పట్టున్న నియోజకవర్గం కావడంతో ఆయన పార్టీ పెట్టిన, ఆత్మీయ సమ్మెళనం నిర్వహించిన భారీగా జన సమీకరణ జరుగుతుందని అందరు భావిస్తున్నారు. ఆ దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి కూడా. ఈనెల 12న జరిగే ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమాన్ని మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు ప్రత్యేక చొరవ తీసుకుని ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. జన సమీకరణ, సభ ఏర్పాట్లు అన్ని తమ నాయకత్వంతో కలిసి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో సత్తుపల్లిలో ఏం జరుగుతుందని అటు పార్టీల నాయకులు, ఇటు అధికారులు, ప్రజలు అసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సభ ఈ సమావేశానికి చుట్టుపక్కల రెండు మూడు నియోజకవర్గాలు తో పాటు ఆంధ్ర సరిహద్దు ప్రాంతం కావడంతో పొంగిలేటి అభిమానులు ఆంధ్రా నుంచి తరలించే అవకాశాలు ఎక్కువగా ఉన్న దృష్ట్యా భారీ అంచనాలతో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మిగతా సమ్మేళనాల కంటే భిన్నంగా నిర్వహించాలని, పొంగిలేటి అనుచరులు కార్యదీక్షతో పనిచేస్తున్నట్లు తెలుస్తుంది.
ఇది కూడా చదవండి: బీజేపా..? కాంగ్రెసా..? పొంగులేటి ఎటువైపు..?
పొంగులేటి సొంత నియోజకవర్గం కావడంతో సత్తుపల్లి ఆత్మీయ సమ్మేళనం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందస్తు సమాచారంతో భారీ సంఖ్యలో జనాల హాజరవుతారని సమాచారంతో సాయంత్రం సమయంలో నాయకులకు ,కార్యకర్తలకు, విచ్చేసిన అభిమానులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా, భోజన వసంత కూడిన సౌకర్యాలు కల్పిస్తున్నారని సమాచారం. ఏర్పాట్లు లో సత్తుపల్లి నియోజకవర్గం పలు మండలాల నుంచి పొంగులేటి ముఖ్య అనుచరులతో పాటు కార్యకర్తలు నాయకులు కలిసికట్టుగా కృషి చేస్తున్నారు,
== మట్టా ‘హ్యాండ్’ ఇచ్చినట్లేనా..?
ఈనెల 12న సత్తుపల్లి నియోజకవర్గంలో పొంగులేటి ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమం నిర్వహిస్తున్న తరుణంలో ప్రజల్లో కొంత ఉత్కంఠ నెలకొంది.. ఈ సమావేశానికి కీలక పాత్ర పోషించాల్సిన పొంగులేటి ప్రధాన అనుచరుడు మట్టా దయానంద్ గత కొంత కాలంగా కనిపించడం లేదు. గతవారం కల్లూరు మండలం నారాయణపురం గ్రామంలో జరిగిన పొంగిలేటి సన్నాహక సమావేశానికి, డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ విముఖత చూపించారు. ఆనారోగ్యం వల్ల రాలేకపోతున్నారని చెబుతున్నప్పటికి ఆయన పూర్తిగా దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: ఆయన్ను గద్దె దించుడే నా లక్ష్యం:పొంగులేటి
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ తో వెళ్తేనే గెలిచే అవకాశాలుంటాయని, ఒంటరిగా వెళ్లిన, బీజేపీతో వెళ్లిన గెలిచే అవకాశాలు లేవని మట్టాదయానంద్ మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. ఈ విషయాల్లో పొంగులేటి కొంత పట్టించుకోవడం లేదనే ఆలోచనతో ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. అంతలోనే ఆయనకు ఆరోగ్యం సహాకరించకపోవడంతో పొంగులేటికి, ఆయన నిర్వహించే సమ్మెళనాలకు చాలా దూరమైయ్యారు. అయితే సత్తులపల్లి నియోజకవర్గంలో నిర్వహించే సభకు హాజరవుతారా..? లేదా.? అనే ఉత్కంఠ నెలకొంది. సత్తుపల్లి నియోజకవర్గ అభ్యర్థి బరిలో ఎవరు ఉంటారా..? ఉండరా..? పొంగులేటి ప్రకటిస్తారా..? లేదా..? అనేదానిపై చర్చలు జరుగుతున్న దృష్ట్యా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆరు చోట్ల ఆత్మీయ సమ్మేళన నిర్వహించి నప్పటికీ, సత్తుపల్లిలో ఆత్మీయ సమ్మేళనంతో కార్యకర్తల్లో, ప్రజల్లో నూతనను ఉత్తేజ నిలుపుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ శుభ పరిణామంలో నూతన పార్టీ సంబంధించిన ప్రకటన వెలుబడుతుందా..? లేదా..?రాబోయే రోజుల్లో ఏ రాజకీయ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయో..? ఈ సభా వేదిక ద్వారా వివరిస్తారని సత్తుపల్లి ప్రజానీకం ఆశగా ఎదురుచూస్తున్నారు. రాబోయే సత్తుపల్లి అసెంబ్లీ ఎన్నికల తో పాటు పార్లమెంటు ఎన్నికల్లో పొంగులేటి మార్పులు కనిపించేలా ఖమ్మం జిల్లాలో పొంగులేటి తమ సత్తా చాటేలా అడుగులు వేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు, ఈ సమ్మేళనం ద్వారా పొంగిలేటి ఆసక్తికరమైన వ్యాఖ్యలతో పాటు పొంగిలేటి విధివిధానాలు ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు, ఈ సమ్మేళనంతో సత్తుపల్లి రాజకీయంతో పాటు ఖమ్మం జిల్లా రాజకీయం పెను మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు, ఈ తరుణంలో పొంగులేటి ఇలాంటి నిర్ణయం తీసుకొని ప్రజలందరూ ఆశీర్వాదం పొందుతారు వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది,..
ఇదికూడా చదవండి: “మట్టా” పయనమెటో….?